ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు
ఏ దేశమేగినా..
కన్న ఊరిని, తన వాళ్ళని మరిచిపోవద్దంటారు..
ఇది కొద్ది మంది కే సాధ్యం. కింది స్థాయి నుంచి… కష్టాల కడలిని ఈది పైకెదిగిన వారిలో కొందరే ఉంటారు… అందులో పైడి రాకేష్ రెడ్డి ఒకరు…

ఎంత ఎదిగినా ఒదిగుండడమే కాదు…. ఉన్నదాంట్లో పదిమందికి సేవ చేయాలని, ఆదుకోవాలని అనుకునేవారూ కొందరే… ఆ జాబితాలో పైడి ఒకరు..

తలుపు తడితే చాలు… తన పరపతి, పైకం, పలుకుబడి ఉపయోగించి ఆదుకోవడం ఆయన నైజం.

పేదరికం ఉన్నత విద్యకు, విదేశీ ఉన్నత చదువుకు ఆటంకం కాకూడదనేది ఆయన తపన…

పదిమందికి, చేయూత కోరేవారికి ఊత కర్రగా నిలవాలనేది ఆయన సిద్ధాంతం…

అవునూ… ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకీ చర్చా.. ?అంటారా ??

కొన్నేళ్ళుగా అయన తెర వెనుక ఆపద్బాంధవుడు…

పేదవాడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యసాయం అందించి ఎన్నో వందల మందికి అయన
ప్రాణ వాయువయ్యాడు….

ఈ చేతి తో దానం చేస్తే ఆ చేతికి తెలియనివ్వని వ్యక్తిత్వం..

కానీ ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. తెచ్చింది రాజకీయ పార్టీలు. రాకేష్ అంకాపూర్ వాసి. కష్టాల కన్నీళ్లతో కడుపు నింపుకొని ఆకలి, దప్పిక తీర్చుకున్నవాడు. ఇప్పుడు ఈ రాకేష్.. కొన్ని రాజకీయ పార్టీలు ‘మట్టిలో మాణిక్యా’న్ని పసిగట్టాయి. సేవా తత్పరత తో జనం మనసుని దోచిన రాకేష్ పై ఫోకస్ పెట్టాయి. తమ పార్టీ నుంచి ఆర్మూర్ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దింపాలనే తహతహ తో ఉన్నాయి. బీజేపీ నుంచి బీఎస్పీ వరకు ఆహ్వానాలు అందాయి. పిలుపుల పలకరింపులూ జరిగాయి. రా రమ్మంటూ మధ్యవర్తుల దౌత్యాలూ నడిచాయి..
అటు నుంచే స్పందన లేదు… సమాధానం రాలేదు… కానీ నిజామాబాద్ రాజకీయాల్లో, మరీ ముఖ్యoగా ఆర్ముర్ నియోజకవర్గ రాజకీయ సర్కిల్ లో ఇప్పుడిదో హాట్ టాపిక్.

పారిశ్రామిక వేత్తగా పరిశ్రమల ఏర్పాటు, ఎన్నో వేల ఉద్యోగాలకు ఊతం… అందుకే ఇప్పుడు ఆ ‘పైడి ‘ పై చర్చ…
రాకేష్ పై నజర్

ఆహ్వానాల నజరానా…..

You missed