జనం నేత జనం మధ్యలో ఉంటాడు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. ఆసరాగా టాడు. భరోసా కల్పిస్తాడు. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేనున్నానంటూ ఊతకర్రవుతాడు. వాళ్లే జనం గుండెల్లో కలకాలం నిలుస్తారు. అలాంటి నేతే బాజిరెడ్డి గోవర్దన్. టీఆరెస్‌నే నమ్ముకుని చివరకు ప్రాణాలొదిలిన ఓ సీనియర్‌ నేత కుటుంబాన్ని ఆదుకున్నాడు బాజిరెడ్డి. ఆ మృతుడి కూతురికి ఉద్యోగం కల్పించి కుటుంబం మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. మాస్ ఇమేజీ ఉత్తిగనే రాదు. జనం లీడర్‌గా ఎదిగినప్పనుడు వస్తుంది. ఆ జనం గుండెల్లో ఒదిగినప్పుడు వస్తుంది.

ఆపదలో ఉన్న వారిని కాపాడే ఆపద్బాంధవుడు నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు, టిఎస్ ఆర్టిసి చైర్మన్  బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గాండ్ల రాజేందర్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. ఆనాడు ఆ యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లి గాండ్ల రాజేందర్ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటానని మాట ఇచ్చిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే , టిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్  ఇచ్చిన మాట ప్రకారం గాండ్ల రాజేందర్ కుమార్తె పూజ కి ఆర్టీసీ బస్ భవన్ లో ఉద్యోగం కల్పించారు. గాండ్ల రాజేందర్ గారి కుటుంబం నేడు టిఎస్ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు, ఇచ్చిన మాటకు కట్టుబడి తమ కూతురు కి ఉద్యోగం కల్పించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

 

You missed