ప్ర‌భుత్వానికి నార్మ‌ల్ డెలివ‌రీల రోగం ప‌ట్టుకున్న‌ది. వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు గ‌ర్బిణుల ప్రాణాల మీద‌కు తెస్తున్న‌ది. సిబ్బంది తమ‌కు ఇచ్చిన టార్గెట్‌ను నింపుకునేందుకు గ‌ర్బిణుల‌పై బూతు భాషా ప్ర‌యోగాన్ని చేయ‌డానికీ వెనుకాడ‌టం లేదు. ప‌న్నప్పుడు తెల్వ‌లేదా..? అని న‌ల్ల‌గొండ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఓ గ‌ర్బిణిపై అక్క‌డి న‌ర్సులు దురుసుగా మాట్లాడ‌టం.. వెయిట్ చేయించ‌డంతో నిండు ప్రాణాలు పోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కల‌కలం రేపింది. అయితే న‌ర్సులు వాడిన ఈ బూతు ప‌దాన్ని చాలా చోట్ల ప్ర‌భుత్వ ఆసుప‌త్ర‌ల్లో సిబ్బంది కొంత మంది వాడుతార‌ట అప్పుడ‌ప్పుడు.

మంత్రి హ‌రీశ్‌రావు ఆరోగ్య మంత్రి కాగానే నార్మ‌ల్ డెలివ‌రీలు పెంచాల‌ని వైద్యాధికారుల‌కు అల్టిమేటం జారీ చేశాడు. వైద్యాధికారులు కింది స్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టారు. దీంతో ప్ర‌స‌వానికి వ‌చ్చిన గ‌ర్బిణుల‌కు సుఖ ప్ర‌సవమ‌య్యే వ‌ర‌కు వెయిట్ చేపిస్తారు. ఈ క్ర‌మంలో వేరే కాంప్లికేష‌న్స్ ఉన్న గ‌ర్బిణులకు ప్రాణాల మీద‌కు వ‌స్తున్నాయి. మొద‌టి సారి ప్ర‌స‌వానికి వ‌చ్చిన వారిని వైద్య‌ప‌రిభాష‌లో ప్రైమీ అని పిలుచుకుంటారు. వీరికి దాదాపుగా నార్మ‌ల్ డెలివ‌రీ చేయాల‌నే చూస్తారు. దీని కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిటింగ్ చేపిస్తారు. ఒక్క‌సారి నార్మ‌ల్ అయితే.. రెండో కాన్పు కూడా నార్మ‌ల్‌కే అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్రైమీ కేసుల ప‌ట్ల ఇప్పుడు మ‌రింత శ్ర‌ద్ద పెరిగింది.

నార్మ‌ల్ కాన్పు కోసం. ప్ర‌భుత్వ ఒత్తిడీ దీనికి ప్ర‌ధాన కార‌ణం. దీంతో ఒక్కో స‌మ‌యంలో ఈ వెయిట్ చేయించే కాలం గ‌ర్బిణుల ప్రాణాల మీద‌కు తెస్తున్న‌ది. మొద‌టి సారి నార్మ‌ల్ అయిన మ‌హిళ రెండో సారి కాన్పు కోసం వ‌స్తే వారిని వంద‌కు వంద‌శాతం నార్మ‌ల్‌కే ట్రై చేస్తారు. దీని కోసం ఎంత స‌మ‌య‌మైన తీసుకుంటారు. కానీ ఒక్కోసారి క‌డుపులో బిడ్డ ఉమ్మ‌నీరు మింగిన సంద‌ర్భంలో ఈప్ర‌యోగం విక‌టిస్తుంది. ప్రాణాలు పోతాయి. కానీ ఇక్క‌డ నార్మ‌ల్ కోస‌మే చూస్తారు. అదే పెద్ద రిస్క్‌. ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు బ‌ద్నాం అయ్యేదీ ఇక్క‌డే.

You missed