ఎప్పుడూ లేన‌ట్టుగా ఈసారి కేసీఆర్ జ‌న్మ‌దినం ఓ చ‌ర్చ‌కు దారి తీసింది. ఓ వివాదానికి తెర లేపింది. ఏకంగా మూడు రోజుల పాటు జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని కేటీఆర్ పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌కు దారితీస్తే… అదే రోజున నిరుద్యోగుల నిర‌స‌న గ‌ళం వినిపించ‌డం వివాదానికి తెర లేపింది. కాంగ్రెస్ నిరుద్యోగ స‌మ‌స్య అస్త్రాన్ని కేసీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బ‌య‌ట‌కు తీసినా…. ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ మాత్రం ఇదే నిర‌స‌నాస్త్రాన్ని ఘాటుగా ప్ర‌యోగించి ముందు వ‌రుస‌లో నిలిచాడు. ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ బీఎస్పీలో చేరిన నాటి నుంచి అక్క‌డ‌క్క‌డా మీటింగుల్లో పాల్గొంటూ కేసీఆర్‌ను, ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే త‌ప్ప ప్ర‌త్య‌క్ష ఉద్య‌మాల్లో పాల్గొన‌లేదు.

అలా వ‌చ్చి ఇలా మాయ‌మ‌య్యే మెరుపుతీగే అయ్యాడు త‌ప్ప‌.. ప్ర‌జ‌ల్లో నిల‌బ‌డి కొట్లాడే నాయ‌కుడ‌నిపించుకోలేదు. బీఎస్పీ అనుబంధ విద్యార్థి సంఘం ద్వారా నిరుద్యోగ స‌మ‌స్య పై ఓయూ వేదిక‌గా ప్ర‌యోగించిన నిర‌స‌న‌గ‌ళం సక్సెస‌య్యింది. టీఆర్ఎస్‌వీ దాడుల‌కు దిగ‌డంతో ఈ ఉద్య‌మం మ‌రింత వేడెక్కింది. ప‌తాక స్థాయికి చేరింది. అంద‌రి న‌జ‌ర్ ప‌డింది. వాస్త‌వానికి నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌త బాగా ఉంది. విద్యార్థులు నోటిఫికేష‌న్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. కార‌ణాలెన్ని చెప్పినా.. ప్ర‌భుత్వం ఊహించినంత‌, ఆశించినంత‌.. అనుకున్నంత‌… ముందు చెప్పినంత‌… ఉద్యోగ క‌ల్ప‌న‌లో ఏమీ చేయ‌లేదు. ఫెయిల‌య్యింది.

ఇది ప్ర‌తిప‌క్షాల‌కు ఓ అస్త్రంగా మారినా.. వాస్త‌వ తీవ్ర‌త నిరుద్యోగుల‌కు తెలుసు. అనుభ‌విస్తున్న నిరుద్యోగుల‌కు ఆ బాధ తెలుసు. ఆఖ‌రికి నిరుద్యోగ భృతిని ప్ర‌క‌టించి కూడా .. ప‌లు మార్లు ఎన్నిక‌ల అస్త్రంగా ప్ర‌యోగించినా కూడా దాన్ని అమ‌లు చేయ‌లేదు ప్ర‌భుత్వం. ఓయూలో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో తెర‌వెనుక ఉండి నడిపించిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ స‌క్సెస‌య్యాడు. ఆ ఉద్య‌మం అనుకున్న‌దాని కంటే ఎక్కువ ఫోక‌స్ అయ్యింది. ఓయూలో అగ్గి రాజుకుంది. ఇది ప్ర‌భుత్వానికి, టీఆరెస్‌కు మంచిది కాదు. అనుకున్న‌ది సాధించ‌డంలో ప్ర‌తిప‌క్షంగా ఇటు బీఎస్పీ, అటు కాంగ్రెస్ స‌క్సెస‌య్యాయి.

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగానే నిరుద్యోగ స‌మ‌స్య లేవ‌నెత్త‌డానికి కార‌ణం….. కేసీఆర్ వ్యూహాన్ని దెబ్బ‌కొట్టేందుకే. బీజేపీతో క‌య్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్.. రాహుల్‌ను నెత్తికెత్తుకున్నాడు. కాంగ్రెస్, టీఆరెస్ ఒక‌టే అనే మెసేజ్‌పోతే… అది టీఆరెస్ కే మేలు చేస్తుంది. దీన్ని దెబ్బ‌కొట్టేందుకు అన్ని దారులు వెతుక్కుంటున్నాడు. కేసీఆర్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూనే ఊస‌ర‌వెల్లి ఫోటో ఒక‌టి పెట్టి వివాదానికి తెర లేపాడు.

You missed