జిల్లా రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ సీ నారాయ‌ణ‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

ప్ర‌భుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలి. కొందరు అనవసర ఆందోళన తో ముందస్తుగా ఎక్కువగా కొని నిల్వచేసుకుంటున్నారు. మిగతా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరికీ యూరియా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలతో ముందుకెళ్తుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి తాత్కాలికంగా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసాం. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నది. అన్ని రకాల పూర్తి సన్నద్ధతో పనిచేస్తోంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం చూసుకుంటుంది.

You missed