జిల్లాలో వ‌చ్చే నెల (ఆగ‌స్టు) 3 నుంచి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మూడవ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ సర్వే లో కొవిడ్ -19, టీబి, కుష్టు వ్యాధి, హెచ్ఐవి, తలసీమియా, డయాలసిస్ తదితర ఆరోగ్య సమస్యలపై ప్రతి కుటుంబానికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలి. జిల్లా యంత్రాంగం తయారు చేసిన యాప్ లో నమోదు చేయాలి. మూడవ తేదీన ఉదయం 7 గంటలకే సంబంధిత అన్ని పీహెచ్‌సీల‌కు, సూప‌ర్వైజ‌ర్ అధికారులు, ఎంపీడీవోలు, మెడికల్ అధికారులు, అంగన్‌వాడీ అధికారులు , ఇతర అధికారులు హాజరై ఒక ప్రణాళిక ప్రకారం సర్వేకు వెళ్లాలి. సర్వేలో పక్కాగా అన్ని వివరాలు ప్రతి ఒక్కరి నుండి సేకరించి నమోదు చేయాలి. పంచాయతీ స్థాయిలో మూడు రోజుల్లో, మున్సిపాలిటీ స్థాయిలో ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలి. క్వాలిటీ పరంగా సర్వేలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

You missed