నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ , రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇన్చార్జ్ తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు త‌దిత‌రుల‌తో క‌లిసి మీడియా స‌మావేశంలో మాట్లాడాడు.

 

మంత్రులు కూడా రాజీనామా చేస్తే జిల్లాలో కూడా అభివృద్ధి పనులు మొదలు పెడ‌తారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంతో సాధించార‌ని కానీ కాలేశ్వరం పేరుతో ప్రభుత్వం చాలా డబ్బులు అవినీతిమయం చేసింది. నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి వెళుతున్నాయి. కేటీఆర్ రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడు. కానీ కేవలం 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ అని, ఇంటికొక ఉద్యోగం అని, బంగారు తెలంగాణ అని ఎన్నో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన‌ప్ప‌డు 14 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇది కేవలం కేసీఆర్ ఘనతే .

దేశంలో నరేంద్ర మోడీ 15 వేల కోట్లు తెలంగాణ ప్రజల ఖాతాల్లో వేస్తానని, నల్ల ధనం వెలికితీత , సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నో వాగ్దానాలు చేసి అన్ని అటకెక్కంచాడు. హిందూ ముస్లిం తగాదాలు పెడుతున్నాడు. మతాల కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు.  తద్వారా ఓట్లు దండుకున్నాడు. అంతర్జాతీయ ముడిచమురు ధర తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం సామాన్య ప్రజలపై వ్యాపారం చేసి డబ్బును సమకూర్చుకుంటుంది. ఏడు సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచి 36 లక్షల కోట్ల సంపాదించిందని ఈ డబ్బంతా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.

బీజేపీ నాయకులు గతంలో కాంగ్రెస్ చేసిన అప్పులను బీజేపీ ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు. కానీ పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ పాత బాకీ ఏది కట్టడం లేదు. కేవలం వడ్డీ మాత్రమే కడుతున్నామ‌ని చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో సామాన్య ప్రజలు బాగు పడలేదు. ఉద్యోగాలు రాలేదు, బీజేపీ ప్రభుత్వంలో కేవలం అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ బాగు పడ్డారు. నరేంద్ర మోడీ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కార్పొరేట్ వ్యాపారస్తులకు అందిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తో నరేంద్ర మోడీ ఎన్నికల్లో గెలిచాడు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రమాదవశాత్తు గెలిచాడు, ధర్మపురి అరవింద్ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళ తండ్రి ఏ పార్టీలో ఉన్నారో, వారి సోదరుడు సంజ‌య్ ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికీ తెలియదు. కేసీఆర్ కాంగ్రెస్ కల‌వ‌లేదు… కేసీఆర్, బీజేపీ, ఎంఐఎం కలిశాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో ఏ రోజు కూడా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికలు అంటే కేసీఆర్ కు పండగ అని ప్రాజెక్టుల పేరుతో కాజేసిన డబ్బంతా ఉపఎన్నికల్లో పెడుతున్నాడు. హుజరాబాద్ లో దళిత బంధు అని కొత్త పథకం పెట్టాడు.. కేవలం ఎన్నికల కోసమే దళిత బంధు ప్రకటించాడు.. కేసీఆర్ దళిత బంధు హుజరాబాద్ లో మాత్రమే ప్రకటించాడు.. కానీ దళిత బంధు హామీ అమలు చేస్తారన్న నమ్మకం లేదు. గతంలో జీహెచ్ఎంసీలో వ‌ర‌ద బాధితుల‌కు పది వేలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు అంటే డబ్బు కర్మాగారంలా చేసే విధంగా చేస్తుందని ఇది సరైనది కాదని రాష్ట్రంలో దళితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలు దళితులకు 3 ఎకరాల భూమి, దళితులకు సీఎం వెంటనే అమలు చేయాలి.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. మధుయాష్కీ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం త‌గదు. జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అధికారం మాదని, పోలీసులు మా వాళ్ళని విర్రవీగడం సరైనది కాదు. నీ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరు. రాబోయే కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.

You missed