నిజానికి నాకు స్వర్ణలత( బోనాల్లో రంగం చెప్పే ఆవిడ) పై జాలి కలుగుతుంది. ఆమె తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే అతి సామాన్య మహిళ.  ఆమెను చిన్నప్పుడే మాతంగి ని చేశారు. మాతంగి అంటే ఒక కత్తి తో పెండ్లి చేసి, ఇక ఆమెకు భర్త ,పిల్లలు ఉండకుండా, ఆమె జీవితం కేవలం దేవునికి అంకితం అయ్యే విధంగా చేయడం అన్నమాట. స్థూలంగా చెప్పాలంటే, ఆచారం పేరుతో ఆమె లైఫ్ ని ఆమెకు కాకుండా చేయడం, ఆ విషయాన్ని ఆమెతోనే అంగీకరింపచేయడం. ఈ ఒక్కరోజే ఆమె దేవత మిగితా 364 రోజులు, రోజు రెక్కాడితే గాని డొక్కాడని కూలి బతుకు. విచిత్రం ఏంటంటే, ఈ ఒక్క రోజు దేవత మిగితా 364 రోజులు వివక్ష అనుభవిస్తూ ఉంటుంది. మాతంగులకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు.

ఒకప్పుడు ఈ మాతంగి, జోగినులు,బసవినిలు విపరీతమైన లైంగిక దోపిడీకి గురయ్యేవారు. ప్రముఖ కవి గుఱ్ఱం జాషువా గారి కూతురు హేమలత మరియు లవణం(ప్రముఖ నాస్తికుడు గోరా గారి పెద్దబ్బాయి) దంపతుల కృషితో 1988 లో దేవదాసి, జోగిని, మాతంగి వ్యవస్థ లను రద్దు చేశారు.
అయినకూడా ఇలా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పండుగలో మాతంగి వ్యవస్థ ను ఇంకా కొనసాగించడం అక్రమం,అతి దుర్మార్గం. పైగా ప్రభుత్వమే మానవ హక్కుల ను కాలరాసినట్లు అవుతుంది. దీనిపై న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Raghu PA

You missed