దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అన్న సాహెల్‌ కూడా సోదరుడి బాటలోనే నడుస్తున్నాడు. మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గా ఉన్న సోహెల్‌.. షకీల్‌ ఓటమి తరువాత పత్తా లేకుండా పోయాడు. అప్పటి వరకు అన్నదమ్ముల రాజ్యం నడిచింది బోధన్‌లో. ఒక్కసారిగా పరిస్థితి తారుమారయ్యింది. సీన్ రివర్స్‌ అయ్యింది. ఓటమి తరువాత మాజీ ఎమ్మెల్యేగా ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు షకీల్‌. ఆ తరువాత జరిగిన వరుస సంఘటనలు షకీల్‌ను దుబాయ్‌కు పారిపోయేలా చేశాయి. దీంతో షకీల్ ఇటు చాయలకే రాలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే… అతని అన్న సోహెల్‌ బోధన్ మున్సిపల్ వైస్‌ చైర్మన్‌.

తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చాలా నడిపించుకున్నాడు సోహెల్‌. ఏకఛత్రాధిప్యతం చెలాయించాడు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న తూము పద్మ శరత్‌రెడ్డిలను డమ్మీ చేసి అంతా తామే నడిపించాలని చూశారు అన్నదమ్ములు. చైర్మన్‌ దంపతులను టార్చర్‌ పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారవ్వడంతో మాజీ ఎమ్మెల్యే దుబాయ్‌లో దాక్కోగా.. తమ్ముడి ఓటమి తరువాత అన్న సోహెల్‌ బోధన్‌లో కనిపించకుండా పోయాడు. బుధవారం కీలకమైన బోధన్‌ మున్సిపల్‌ బడ్జెట్ సమావేశానికి కూడా సోహెల్‌ రాలేదు. దీంతో షకీల్‌ సోదరుడి గురించి బోధన్‌ రాజకీయాల్లో చర్చ మొదలైంది. అన్నదమ్ములు ఇద్దరూ బీఆరెస్‌ క్యాడర్‌కు అందుబాటులో లేకుండా పోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది అక్కడ.

You missed