దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ పేరు ఖరారైంది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును దాదాపుగా అధిష్టానం ఓకే చేసేసింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రేసులో నలుగురైదుగురు ఉన్నా అధిష్టానం నిర్వహించిన సర్వేలో జీవన్‌రెడ్డికే మొగ్గు చూపారు జనాలు. ఆఖరికి దిల్‌రాజు కూడా సర్వే రేసులో జీవన్‌రెడ్డితో పోటీ పడలేకపోయాడు. దీంతో జీవన్‌రెడ్డికి మించిన క్యాండిడేట్ లేడని ఫిక్స్‌ అయిపోయింది అధిష్టానం. ఇక ప్రకటించడమే తరువాయిగా ఉంది.

ఇక మిగిలింది బీఆరెస్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది. రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలతో కూడా ఆయన చర్చించినట్టు తెలిసింది. జిల్లాలో పట్టున్న నేతగా ఉన్న బాజిరెడ్డికి ఇస్తే గట్టి పోటీ ఇవ్వగలడనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. దాదాపుగా బాజిరెడ్డి పేరును కేసీఆర్‌ ఫైనల్‌ చేసేసినట్టు తెలిసింది. బాజిరెడ్డి బరిలో ఉంటే అర్వింద్‌కు దెబ్బే. మున్నూరుకాపుల ఓట్లు చీలనున్నాయి. ఇది అర్వింద్‌కు ఇబ్బందికరంగానే మారనుంది.

You missed