దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నది. తాజాగా ఈ లిస్టులో కొత్త పేరు వచ్చి చేరింది. దిల్ రాజు పేరు మొదటి నుంచి వినిపించినా.. చివరాఖరకు తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పినట్టు తెలిసింది. తన అన్న నర్సింహారెడ్డి పేరును కూడా సూచించడంతో ఇప్పుడు కొత్తగా లిస్టులో ఈయన పేరు వచ్చి చేరింది. మొత్తం నలుగురి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు బీసీ కోటాలో ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో ఈరవత్రి అనిల్ ఎంపీ టికెట్ కోసం అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది.