దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

ఎమ్మెల్సీ కవితను డ్యామేజీ చేసే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో ప్రధాని మోడీ ఆడుకుంటున్నాడు. సీబీఐకి ఈ కేసు అప్పగించాడు. ఈనెల 26న హాజరుకావాలని సీబీఐ కవితకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే కొత్తగా ఓ వార్త వైరల్ అయ్యింది. మొన్నటి వరకు నిందితురాలిగా కవితను చేర్చలేదని, ఇప్పుడు సీబీఐ కవితను నిందితురాలిగా చేర్చిందనేది ఆ వార్త సారాంశం. అరెస్టు చేయడానికి కూడా చాన్స్‌ ఉందంటూ ఓ ప్రతికలో పతాకశీర్షికన కథనం వచ్చింది. అయితే కవిత టీమ్‌ చెప్పిందో, లేక బీఆరెస్‌ సోషల్‌ మీడియా, నేతల అత్యుత్సాహమో తెలియదు కానీ.. ఇవాళ ఉదయం నుంచి ఈ పేపర్‌ వార్త క్లిప్పింగ్‌ను బీఆరెస్‌ శ్రేణులే తెగ వైరల్‌ చేస్తున్నారు.

ఆ క్లిప్పింగ్‌తో పాటు ఆమె నిందితురాలు కాదు బాధితురాలు అంటూ ఓ క్యాప్షన్‌ కూడా జోడిస్తున్నారు. అయితే ఇది కవితకు సింపతీ తెచ్చిపేట్టేలా లేదు. మరింత డ్యామేజీ చేసే విధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత పట్ల ఆ పార్టీలోనే సానుభూతి కరువైన నేపథ్యంలో బీఆరెస్‌ శ్రేణులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడం ఆమెకు మరింత నష్టదాయకంగా మారింది. రేపు ఆమెను అరెస్టు చేసిన పెద్దగా స్పందన వచ్చేలా లేదు ప్రజల నుంచి పార్టీ నుంచి. అలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది మరి. సోషల్‌ మీడీయాలో తేరగా ఉండి ఏం చేస్తాం… ఓ పోస్ట్‌ పడేస్తే పోలా అని ఇలా ఖాళీగా కూసున్న హార్డ్‌ కోర్ బీఆరెస్‌ నాయకులు తగుదునమ్మా అని పనిగట్టుకుని మరీ కవితను బజారుకీడుస్తున్నారు. తెలియని వారికి కూడా ఈ వార్త క్లిప్పింగ్‌ వైరల్‌ ద్వారా కవితను నిందితురాలిగా చేర్చారు.. అరెస్టు తప్పదు అనే సందేశాన్ని తామే చేజేతులా వైరల్‌ చేస్తున్నారు.

ఇదీ సంగతి..! చెప్పేవారేలేనప్పుడు… పట్టించుకున్నవారే దిక్కులేనప్పుడు..? వ్యూహాలేమిటో.. ఎత్తుగడలేమిటో మరిచిపోయి ఆదమరిచినప్పుడు ఇలాగే ఉంటుంది మరి.

You missed