దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ సీటు ఎవరికనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ నేతలిద్దరు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేతగా పేరున్న అరికెల నర్సారెడ్డి టికెట్ కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నాడు. సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న పరిచయం, నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఎంపీ టికెట్ కోసం పోరాడుతున్నాడు. జీవన్‌రెడ్డితో పోల్చితే అరికెల నర్సారెడ్డికి జిల్లాపై పట్టుంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు జిల్లాకు చెందినవే. దీంతో పక్కజిల్లా నేతలకు అంత ప్రయార్టీ ఇవ్వడం లేదు అధిష్టానం. ఇది అరికెలకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. రెడ్డిలకు టికెట్ ఇవ్వాలనేది కన్ఫాం. దీంతో ఈ ఇద్దరి మధ్యే టికెట్ పోరు సాగుతుంది. అందులో ముందు వరుసలో ఉన్నాడు అరికెల.