కేసీఆర్‌ అంతే. ఏదైనా సరే ముహూర్తం చూస్తారు. రాహుకాలం, వర్జ్యం అన్నీ పాటిస్తారు. దేవుళ్లంటాడు. దైవేచ్చ అని మాట్లాడుతాడు. దీన్ని మూర్ఖత్వమని కొందరన్నా.. మరీ చాదస్తమని మరికొంత మంది వెక్కిరించినా పట్టించుకోడు. డోంట్‌ కేర్‌ అంటాడు. ఆయన లక్కీ నెంబర్‌ ఆరు. అందుకే ఐదు ప్లస్‌ ఒకటి.. మొత్తం ఆరు. దీనికి ఆయనేదో కారణం చెప్పాడు. కానీ అది కాదు విషయం. సిట్టింగులకు టికెట్లు ప్రకటించినా.. ఇలా బీఫారాలు ఇచ్చినా మొత్తం సంఖ్య కూడితే ఆరు రావాలి. అదీ ఆయన సెంటిమెంట్‌. అంతే ఎవరి పిచ్చి వారికానందం. ఇదిప్పుడు కొంత మంది సిట్టింగులకు మార్చేందుకే అనే వాదనను తెరపైకి తెచ్చింది.

దాదాపుగా ఆయన టికెట్లు ప్రకటించిన ఏ స్థానాలనూ మార్చే ఆలోచనలో లేనట్టున్నాడు. ఎందుకంటే.. అలా మార్చాలంటే చాలానే మార్చాల్సి వస్తుంది. దాదాపు మెజారిటీ ప్రజా వ్యతిరేత తీవ్రంగా మూటగట్టుకుని ఉన్నారు. ఎవరిని మార్చినా లాభం లేదు. ఇంకొకరు ఇక్కడ మనలేరు. పోటీ చేయలేరు. గెలవలేరు. ఉన్నవారితోనే నెట్టుకురావాలి. కేసీఆర్ అలా తయారు చేసి కూర్చున్నాడు మరి. ఎమ్మెల్యేలే సుప్రీమ్ అన్నాడు. సిట్టింగులకు మార్చితే కొంప ముంచుతారని భయపడి .. వరుసగా వారికే మూడోసారి టికెట్లు ఇస్తూ పోయాడు. ఇప్పుడు ఇలా భయపడుతున్నాడు. హితబోధ చేస్తున్నాడు. ఈగోలు వీడండని కాళ్లా వేళ్లా పడుతున్నాడు.

అందరినీ కలవండయ్యా బాబు అంటూ కలరవపాటుకు గురవుతున్నాడు. కార్యకర్తలను విస్మరిస్తే మీ కొంపలు ముంచుతారని నష్టం జరిగిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు మేల్కొలుపు పాటలు పడుతున్నాడు కేసీఆర్. ఎంత లక్కీనెంబర్‌ సెంటిమెంట్‌ ను పాటించినా ప్రాక్టికల్‌గా రూట్‌ లెవల్లో ప్రజలు డిసైడ్‌ అయ్యి ఉన్నారంటే అంతే సంగతులు. చూడాలి మరి కేసీఆర్ సెంటిమెంటు ఎంత వరకు విజయం సాధిస్తుందో.

You missed