కేసీఆర్ సిట్టింగులకు చురకలంటించాడు. బీ ఫారాలు అందరికీ ఇవ్వలేదు. ఏవో కారణాలు చెబతూ సగం మందికి మాత్రమే బీ ఫారాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈగోలు, అహంకారాలతో పోతే కొంపలు మునుగుతాయని హెచ్చిరించాడు కేసీఆర్. ప్రతి కార్యకర్తనూ కలిసి, అసంతృప్తి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ వారికి ఉచితోపదేశం చేశాడు. తనకు సిట్టింగులపై విచిత్రమైన జడ్జిమెంట్లు వచ్చాయని ఓ బాంబు వేశాడు. సిట్టింగుల గుండెల్లో బాంబు పేల్చాడు. దీనికి తోడు అందరికీ బీ ఫారాలు ఇవ్వకపోవడంతో ఆ భయం రెట్టింపయ్యింది. రెండ్రోజుల్లో బీ ఫారాలు అందరికీ అందిస్తామని చెప్పినా అది డౌట్‌గానే కనిపిస్తున్నది.
దీంతో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులకు మార్చనున్నారనే ప్రచారానికి ఇది ఊతాన్నిచ్చింది. సిట్టింగులు అహంకారానికి పోయి అందరికీ కలుపుకుపోవడం లేదనేది సీఎం కేసీఆర్ నోటీస్‌కు వచ్చింది. అందుకే ఆయన ఈ మీటింగులో డైరెక్టుగా అభ్యర్థులకు చురకలంటించాడు. ఇలా అయితే కష్టమేననే సిగ్నల్ ఇచ్చాడు. అంటే.. బీ ఫారాలు చేతికందే వరకు అనుమానమే అనే రీతిలో కేసీఆర్ మాట్లాడటంతో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న అభ్యర్థుల్లో అలజడి మొదలైంది.