నిజామాబాద్‌లో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు కాంగ్రెస్‌ ఝలక్‌ ఇచ్చింది. అర్బన్‌ నుంచి డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు మొండి ‘చేయి’ చూపింది. అర్బన్‌ టికటె్‌ ప్రకటించకపోయినా.. సంజయ్‌కు మాత్రం ఇచ్చే సూచన లేదనే సిగ్నల్‌ ఇచ్చేసింది. మరోవైపు ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌ బీసీ కార్డుతో ఢిల్లీ చుట్టొచ్చినా లాభం లేకుండా పోయింది. సంజయ్‌ పార్టీపై అలక వహించాడు. సైలెంట్‌గా ఉండిపోయాడు. గోర్త రాజేందర్‌ బీఎస్పీ నుంచి టికెట్‌ తెచ్చుకునే ఆలోచనలో ఉన్నాడు. మొదటి లిస్టులో ముగ్గురు రెడ్లనే ప్రకటించారు.

బోధన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ నుంచి వినయ్‌ రెడ్డి, బాల్కొండ నుంచి సునీల్‌రెడ్డిల పేర్లు డిక్లేర్ చేశారు. నిజామాబాద్‌ రూరల్‌లో మండవ వెంకటేశ్వరరావు వస్తాడనే ప్రచారం ఇంకా అలాగే కొనసాగుతున్నది. అర్బన్‌లో ఆకుల లలితకు ఇస్తే మున్నూరుకాపులకు కొంత ఊరట లభించననున్నది. కానీ ఆకుల లలిత టికెట్‌ పై ఇంకా క్లారిటీ లేదు. వారింకా కాంగ్రెస్‌ పార్టీలోనే చేరలేదు. మరోవైపు ఓ మైనార్టీ నేత కూడా అర్బన్‌ టికెట్ రేసులో కీలకంగా ఉన్నాడు.

అయితే అతనికి ఇస్తే బీజేపీ గెలుపు మరింత సులవవుతుందనే సర్వే రిపోర్టుతో అర్బన్‌ బీసీకే ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది. మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఇస్తే కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ఓడినట్టేనని ఆ పార్టీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు. మధ్యేమార్గంగా మున్నూరుకాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో చర్చలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా నుంచి ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. షబ్బీర్‌ అలీ పేరు దాదాపు ఖరారైపోయింది.. మొదటి జాబితాలోనే ఉంటుందని అంతా అనుకున్నారు. పొటీ కూడా లేదు. కానీ అనూహ్యంగా అతని పేరు లేదు. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.

You missed