పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం…. ఆందోళన చెందకండి… కేసీఆర్‌ ఎకరాకు పదివేల పరిహారం ఇస్తున్నారు…

ఇది ప్రకృతి వైపరీత్యం.. అకాల వర్షాలతో పంట నష్టం చాలా బాధాకరం…

తడిచిన ధాన్యాన్ని కొనమని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ఆదేశాలిచ్చాం…

రవాణా సౌకర్యం, గన్ని బ్యాగులు, హమాలీల ఏర్పాటు చేశాం..

రూరల్ నియోజకవర్గం లో ఏడు మండలాలలో 6వేల ఎకరాల పంట నష్టం జరిగింది..

నోటికాడి పంట నీటి పాలు కావడం పట్ల చాలా బాధ పడుతున్నాం

– ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ భరోసా

నోటికాడికి వచ్చిన పంట వర్షార్పణం కావడం పట్ల సీఎం కెసిఆర్, మేము చాలా బాధ పడుతున్నాం… ఇది ప్రకృతి వైపరీత్యం.. ఇలా జరగడం బాధాకరం… రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వడగళ్ల వానలతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయల పరిహారం అందిస్తుందని, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండానే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పరిహారాన్ని ఇప్పటికే ఇప్పించి ఉన్నారని, త్వరలో రూరల్ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు అందుతుందని బాజిరెడ్డి గోవర్దన్‌ భరోసా ఇచ్చారు.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.రూరల్ నియోజకవర్గం లో ఏడు మండలాల పరిధిలో 6వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, వెంటనే దీనికి పరిహారం ఇప్పిస్తామని అన్నారు. తడిచిన ధాన్యం కొనుకోలు చేయాలని పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు ఆదేశాలిచ్చామని, దీనికోసం ట్రాన్స్పోర్ట్, గన్నీ బ్యాగుల ఏర్పాటు కూడా చేశామన్నారు.
ప్రతిసారి ఇదే విధంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గమనించారని, అందుకే ఇకపై యాసంగి పంటలు మార్చి నెలాఖరులోగా కోతలకు వచ్చేలా నాట్లు తొందరగా వేసుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారన్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు కూడా ప్రతి ఏడాది మాదిరిగా కాకుండా ఓ నెల ముందు నుంచే విత్తనాలు, నాట్లు వేసుకోవడం వల్ల పంట మార్చి నెలాఖరు వరకు చేతికొస్తుందని, ఆ తర్వాత వచ్చే అకాల వర్షాలతో రైతు నష్టపోడని సూచించారు. తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడతామని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని.. రైతు నష్టపోకుండా చూస్తాడని, వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించి రైతును రాజు చేయడమే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌ పాలన యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. రైతులెవ్వరూ దిగులు చెందొద్దని ఆయన కోరారు.

You missed