కేంద్ర ప్రభుత్వ వంట గ్యాస్ సిలెండర్ ధర పెంపునకు నిరసిస్తూ నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ , నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ , ఎమ్మెల్సీ వీజి గంగాధర్ గౌడ్ ఉన్నారు.

అనంతరం గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ… పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిన చందమిది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై ధరల భారం వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం గృహోపకార గ్యాస్‌ ధరలు పెంచుతూ పెనుభారం మోపుతున్నది, పెట్రోల్ డీజిల్ ధరలు, ప్రజల నిత్యవసరల ధరలు పెంచి, పేద ప్రజల నడ్డి విరిచే విధంగా అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ రాష్ట్రం, రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి నాయకులకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన మండిపడ్డారు.

స్థానికంగా ఉన్న ఎంపీ, ఏ ఒక్క గ్రామానికి నిధులు తెచ్చిన ముఖం లేదు, ప్రొద్దున లేస్తే అసత్య సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం, కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచింది, ఇక్కడున్న బిజెపి నాయకులు ఏం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410 ఉంది. ఇప్పుడు రెండు రెట్లు దాటిపోయింది. మంగళవారం వరకు వంట గ్యాస్‌ ధర రూ.1105 ఉండగా.. తాజాగా ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలు పెంచుతున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1155కి పెరిగింది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై జనవరిలోనే రూ.25 బాదారు. ఇప్పుడు మళ్లీ రూ.300 పెంచడంతో రూ.2,268కి చేరింది. భారీ పెరుగుదలలో బతుకు జీవుడా అని జనం ఆందోళన చెందుతున్నారు అని ఆయన విమర్శించారు.

 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్, ఏడు మండలాల జడ్పిటిసిలు, పార్టీ ప్రెసిడెంట్లు, మండల రైతు బంధు అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ డైరెక్టర్లు, మండల ప్రధాన కార్యదర్శలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ అనుబంధ కార్యవర్గ సభ్యులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You missed