నాయకులంటే ఇలా ఉండాలి. ప్రజలకు అవసరాలేమిటి..? తక్షణ అవసరాలకు ఏం చేయగలం..? అని ఆలోచించి వాటిని సాధించి పెట్టే నాయకుడే మాస్ లీడర్‌గా ఎదుగుతారు. అలాంటి కోవకే చెందిన వారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. రూరల్ నియోజకవర్గంలో కొన్ని రోడ్ల దుస్థితి బాగాలేదు. తను స్వయంగా వాటిని పర్యవేక్షించారు. బాగు చేయాలని, కొత్తవి వేయాలని ప్రజల నుంచి వినతులు వచ్చాయి. నిధులు లేవు. కానీ అవి ప్రజలకు అత్యసవరం. ఏం చేయాలి…? వెంటనే ఆర్అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడారు. పరిస్థితి వివరించారు. నిధుల లేమి ఉన్నా… ఇవి ప్రజల తక్షణ అవసరాలని, వాటిని త్వరగా చేయాలని గుర్తు చేశారు. వేర్వేరు పనులు. అన్నీ తక్షణ అవసరాలే. చిరకాల కోరికలే. ఎప్పటి నుంచో కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నవే. వీటి ప్రయారిటీని క్షుణ్ణంగా మంత్రికి వివరించి నిధులు మంజూరు చేయడంలో బాజిరెడ్డి సఫలీకృతులయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 44 కోట్ల నిధులు రాబట్టి.. నియోజకవర్గంలో కీలక రోడ్ల రూపు రేఖలు మార్చేసేలా చేశారు బాజిరెడ్డి. ఎమ్మెల్యే చొరవకు, పట్టుదలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబట్టి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ఎమ్మెల్యే ముందుంటారని కొనియాడుతున్నారు. ఈ సందర్బంగా బాజిరెడ్డి … మంత్రి ప్రశాంత్‌రెడ్డికి,ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రోడ్లకు నిధులు మంజూరు
👉జక్రాన్ పల్లి మండలానికి రోడ్లకు, మరియు వంతెనకు ₹ 22 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు
👉సిరికొండ మండలానికి రోడ్లకు ₹ 9 కోట్లు నిధులు మంజూరు
👉ఇందల్వాయి టు వయా ధర్పల్లి రోడ్లకు ₹ 8 కోట్ల నిధులు మంజూరు
👉డిచ్పల్లి మండల పరిధిలోగల సెంటర్ లైటింగ్ అండ్ డివైడర్ పనులకు ₹4 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు
జక్రాన్ పల్లి మండల ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు నేడు టిఎస్ ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్
💥 జక్రాన్ పల్లి మండలం కేంద్రంలో గల ఎన్ హెచ్ హైవే నుండి చేంగల్, వయా భీంగల్, గ్రామాల వరకు డబుల్ నైన్ బిటి రోడ్డు గౌరవ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్గా అభ్యర్థన మేరకు, మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి డబుల్ లైన్ బీటి రోడ్డు పనులకు ₹18 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది, అలాగే మరియు మునోరాబాద్ గత వర్షాలు కారణంగా దెబ్బతిన్న వంతెనను పునర్నిర్మాణానికి కొత్తగా బ్రిడ్జి కు వంతెన ₹నాలుగు కోట్ల విధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జక్రాన్ పల్లి మండల ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు అని అన్నారు, తొందరగా పనులు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకుంటామని తెలిపారు, అనంతరం ప్రజలు వేల కోట్లతో వేచించి నిర్మిస్తున్న రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఎంతగానో ఉంది, వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేటప్పుడు ట్రాక్టర్లు కేజీ వీల్స్ ని రోడ్డుపై తీసుకెళ్లి రోడ్లను పాడు చేయవద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా జక్రన్ పల్లి మండల వాసులు, భారీ వర్షాల కారణాలవల్ల రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే, కానీ ఇప్పుడు నిధులు మంజూరు అయినందున పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కావున త్వరలో రోడ్డు పనులు పూర్తిచేసుకుని ప్రారంభించుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
💥 సిరికొండ ప్రజల రవాణా సౌకర్యార్థం నెరవేరిన కళ
సిరికొండ మండలం నుండి వేములవాడ వరకు ఏదైతే ఫారెస్ట్ పరిధిలో ఉందో డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులకు 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
💥 ఇందల్వాయి మండలం నుండి ధర్పల్లి వయా సిరికొండ మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయమంగా మారిన విషయం తెలిసిందే మరోమ్మత్తుల పనుల కొరకు 8 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు, కానీ కొంతమంది బిజెపి నాయకులు రెండు మూడు గుంతలు మట్టితో పూడ్చి రాజకీయాలు చేయడం జరిగింది, రెండు మూడు గుంతలు మట్టితో నింపగానే రోడ్డు కంప్లీట్ అవుతుందా… అబద్ధపు ప్రచారాలు చేసుకోవడం, నోరు తెరిస్తే అబద్ధం స్థానికంగా ఉన్న ఎంపీ ఒక్క రూపాయి అయినా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇచ్చిన దాఖలు లేవు. కావున రాబోయే రోజుల్లో బిజెపి నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన మండిపడ్డారు.
💥 డిచ్పల్లి మండల కేంద్రంలో గల నడిపల్లి నుండి నాగపూర్ గేటు వద్ద వరకు డివైడర్ మరియు సెంటర్ లైటింగ్ కు ₹ నాలుగు కోట్ల 50 లక్షలు మంజూరు అయినాయని పేర్కొన్నారు త్వరలోనే టెండర్ పిలిపించి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
💥అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లకు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు పూర్తి చేసుకొని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రోడ్డు రవాణా ట్రాన్స్పోర్టేషన్ ఒక విధంగా బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.
💥 నిధులు మంజూరు కి సహకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు అలాగే ఎమ్మెల్సీ గౌరవ కల్వకుంట్ల కవితమ్మ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్.