బీడీ క‌టాఫ్ డేట్ నిబంధ‌న‌ను ఎత్తివేసిన ప్ర‌భుత్వం .. దీన్ని కేవ‌లం నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకే ప‌రిమితం చేసింది. వాస్త‌వంగా బీడీ కార్మికులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో కొంత మేర ఉన్నారు. వీరంద‌రికీ ఇది వ‌ర్తించాలి. కానీ ప్ర‌భుత్వం దీన్ని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసింది. క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాను ఇందులో ఇంకా చేర్చ‌లేదు. దీనికిపై ఎప్ప‌టిలోగా క్లారిటీ వ‌స్తుందో కూడా తెలియ‌ద‌ని అధికారులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే నిర్మ‌ల్ జిల్లాకు మాత్రం ఈ క‌టాఫ్ డేట్ ఎత్తివేత నిబంధ‌న‌ను అమ‌లు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికీ ఇంకా నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో వీటికి సంబంధించిన ద‌ర‌ఖాస్తులు తీసుకోవ‌డం లేదు. వాస్తవంగా వీరంద‌రికీ వ‌ర్తింప‌జేయాలి. కానీ ఇంకా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోలేదు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో ద‌ర‌ఖాస్తులు తీసుకుంటున్నారు.. కానీ డాటా ఎంట్రీ చేసేందుకు సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. స‌మ‌యం ప‌డుతుందంటున్నారు.

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత‌.. ఇక పై పీఎఫ్ నెంబ‌ర్ ఉంటే చాలు ఆస‌రాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… రెండ్రోజుల్లో ఉత్త‌ర్వులు…

You missed