వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ?

అవును …

1 . జీవితం లో అప్పటిదాకా ఎలాంటి వ్యాయామం లేకుండా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ను పేరపెట్టుకొని ఒక్కసారిగా వెళ్లి బరువులెత్తితే … గుండెపై భారం పడి.. .

2 . రకరకాల కారణాల వల్ల గుండె అప్పటికే బలహీనంగా అయివుంటే… అలాంటి స్థితిలో ఒక్కసారిగా జిం కి వెళ్లి బరువులెత్తితే ..

3 . ఫాట్ ను తగ్గిద్దామనుకొని కొన్ని రకాల మాత్రలు తింటే…. గుండెపై భారం పడి …

4 . గంటల తరబడి, అంటే రోజుకు మూడు నాలుగు గంటలు వ్యాయామం చేస్తే …

కానీ వాస్తవం ఏమిటంటే జిం లో వ్యాయామం చేసి గుండెపోటు తెచ్చుకొన్నవారు బహు అరుదు . జిం ట్రైనర్ లు అందరూ పూర్తి స్థాయి ట్రైనింగ్ పొంది ఉండక పోవచ్చు . కానీ పాపం బతుకు తెరువు కోసం కస్టపడి నేర్చుకొంటున్నారు . బాగానే గైడ్ చేస్తున్నారు . చిన్న లోపాలు ఉండవచ్చు… కానీ మరీ మిస్ గైడ్ చేసేవారు అరుదు ..

మరి జరుగుతోంది ఏమిటంటే …

వాక్ సీన్ వేసుకొన్న వారిలో కొంత మందికి గుండె బలహీనం అవుతోంది . లేదా రక్తం లో క్లోట్స్ వస్తున్నాయి . ముఖ్యంగా గుండె బలహీనం కావడం . ఇలాంటి వారు .. పాపం మరణిస్తున్నారు . వారికి జిం కి వెళ్లే అలవాటు ఉంటే .. ఇది వ్యాయామం వల్లే జరిగిందని .. ఆస్ట్రేలియా క్రికెటర్ లిక్విడ్ డైట్ లో ఉంటే దాని వల్లే జరిగిందని , లేక పొతే పోస్ట్ కోవిద్ అని ఇలా రకరకాలుగా ప్రచారం …. కావాలని తప్పుదారి పట్టించే ఫార్మసురులు.. వారి బ్రోకర్ లు.. విషయం పై అవగాహన లేకుండా అమాయకత్వం కొద్దీ గుండెపోటుకు వ్యాయామమే కారణం అని నమ్మే వారు మరి కొందరు ..

జిం ట్రైనర్ అనేది ఒక పెద్ద కోర్స్ . సైంటిఫిక్ గా జరిగేది . అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా అనేక పుస్తకాలు చదువుతారు . అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్తలు , డాక్టర్ లు వీటిని రాసారు . ఇదొక ప్రత్యేక సైన్స్ . బాగా అడ్వాన్స్ అయ్యింది . మామూలు వ్యక్తులకు అవగాహన ఉండే అవకాశం లేదు .

ఒక విషయం చెబితే మీరు నమ్మరు . నమ్మితే షాక్ అవుతారు .. హైదరాబాద్ లో ఒక జిం ట్రైనర్ నెల ఫీజు ఇరవై నుంచి అరవై వేలు . ఏంటి? నెల జీతం అనుకొంటున్నారా ? కాదండీ.. మీరు రోజుకు ఒక గంట జిం ట్రైనర్ సేవల్ని వినియోగించుకోవాలంటే వారికి నెలకు చెల్లించాల్సింది ఇరవై నుంచి ఆరవ వేలు . వారి సీనియారిటీ బట్టి రేట్లు ఉంటాయి . సినిమా నటుల ఇళ్లకు వెళ్లి ట్రైనింగ్ ఇచ్చే వారి రేట్ లు లక్ష- రెండు లక్షలు ఉంటాయి . ఇంతేసి డబ్బులు ఎవడూ ఏదో ఫ్రీ గా అమాయకత్వం కొద్దీ ఇచ్చేయరు . వారి దగ్గర అంత సబ్జెక్టు ఉంటుంది . వారి అవసరం కూడా అంత ఉంటుంది .

తెలియక పోవడం తప్పు కాదు . తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు . ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు .

ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే లోతుగా అధ్యయనం చెయ్యాలి . ఏదో గాలి వార్తలు విని , లేదా అవగాహన లేకుండా వ్యాయామం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని అనుకొని కనీసం వాకింగ్ చేయడం మానేస్తే నష్టం ఎవరికి? మన అవగాహనే మన ఆరోగ్యం .

మరి కొన్ని విషయాలు .

మీరు వాక్ సీన్ వేసుకున్నాక కనీసం ఆరు నెలలు వ్యాయామం చేయొద్దు .

వ్యాయామం ప్రారంభించాలి అంటే ముందుగా కొన్ని నెలలు వాకింగ్ .. స్పీడ్ వాకింగ్ చేసి మీ గుండెను సిద్ధం చేసుకోవాలి . అటు పై జిం లో వ్యాయాయం చేసినప్పుడు కూడా ముందుగా కనీసం పది నిముషాలు కార్డియో చెయ్యాలి . కార్డియో వల్ల గుండె శృతి తప్పి అతివేగం గా కొట్టుకొంటుంటే గుండె చెక్ చేసుకోవాలి .

ప్రతి ఒక్కరికి జిం .. కోచ్ అక్కర లేదు . కానీ ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం ఇరవై నిముషాల నడక అవసరం . ఇది లేక పొతే మిమ్మల్ని మీరు మోసగించుకొంటున్నట్టే .

యోగ గొప్ప విద్య . జిం లో వ్యాయామం ఒక ప్రత్యేక విద్య . దేని ప్రత్యేకతలు దానికున్నాయి . అసలు పోలిక ఎందుకు ? వీలు బట్టి ఏదో ఒకటి చెయ్యి . వీలుంటే రెండూ చెయ్యి . ఏది లేకుండా దేని జోలికి పోకుండా ఏదో మొత్తం తెలిసినట్టు అదే ఇదీ అని కామెంట్స్ చేస్తే ఎలా ?

Amarnath Vasireddy

You missed