క‌రోనా ప్రైవేటు ఆస్ప‌త్రుల యాజమాన్యాల‌ను, డాక్ట‌ర్ల‌ను, మెడిక‌ల్ షాపుల ఓన‌ర్ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేశాయి. జ‌నం ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన క‌రోనా ఈ సెక్ష‌న్ల‌కు మాత్రం వ‌రంగా మారింది. దీంతో పుట్ట‌గొడుగుల్లా కొత్త ఆస్ప‌త్ర‌లూ పుట్టుకొచ్చాయి. ఆ త‌ర్వాత క‌రోనా తీవ్ర‌త త‌గ్గుతూ వ‌చ్చింది. క్ర‌మంగా అది ఇగో ఇలా సీజ‌న‌ల్ వ్యాధిగా మారిపోయింది. మూడో వేవ్‌, నాలుగో వేవ్ వ‌చ్చింది… వ‌చ్చింది…. అంటూ మెడిక‌ల్ మాఫియా ఎంత హ‌డావుడి చేసి జ‌ల‌గ‌ల్లా ర‌క్తం పీల్చుదామ‌ని చూసినా ప‌ప్పులు ఉడ‌క‌లే. క‌రోనా దెబ్బ‌తో జ‌నాల్లో కూడా హెల్త్ అవేర్‌నెస్ పెరిగింది.

శుభ్ర‌త‌, జాగ్ర‌త్త‌ల ప‌ట్ల ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూప‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆస్ప‌త్రుల‌కు రోగుల సంఖ్య త‌గ్గింది. ఎన్నో ఆశ‌ల‌తో ఎదురుచూసిన మెడిక‌ల్ మాఫియాకు ఇది కోలుకోలేని ఎదురుదెబ్బే. కోట్ల‌ను ఆర్జించి పెట్టే క‌రోనా .. ఇప్పుడు సీజ‌న‌ల్ వ్యాధిగా రూపాంత‌రం చెంద‌డ‌మేమిటీ…? అని పాపం వారికి నిద్ర‌కూడా ప‌ట్ట‌డం లేద‌ట‌. శానిటైజ‌ర్లు, మాస్కులు… మందులు కోట్లు పెట్టి స‌ర‌ఫ‌రా చేయించుకున్నారు. ఇప్పుడ‌వ‌న్నీ వృథానే. వాటిని అడిగేవాడు లేడు. క‌నీసం ముఖానికి క‌ర్చీప్ కూడా క‌ట్టుకోవ‌డం లేదు. అంతే క‌రోనా ఇక మాకు రాదు.. వ‌చ్చినా ఏమీ కాదు అనే భావ‌న ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకున్న‌ది. ఏమున్నా టైపాయిడ్‌, డెంగీ లాంటి వ్యాధుల‌న్నా విప‌రీతంగా పెరిగి న‌ష్టాల ఊబిలో ఉన్న త‌మ‌ను కాపాడితే బాగుండు అనుకుంటున్నాయ‌ట‌… మెడిక‌ల్ మాఫియా జ‌ల‌గ‌లు. మాకూ ఓ రోజు మ‌ళ్లీ వ‌స్తుంద‌నే ఆశ‌లో, భ్ర‌మ‌లో, ఊహ‌లో బ‌తుకుతున్నార‌ట‌.

You missed