కలిసిపోయింది !

వర్షాకాలం లో సీజనల్ జ్వరాలు వస్తుంటాయి . జలుబు , దగ్గు , వైరల్ జ్వరం … వీటికి తోడు మలేరియా , కొన్ని సంవత్సరాలుగా డెంగీ…. కొంతమేర టైఫాయిడ్ … ఇలా

ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్ లోకి కరోనా చేరిపోయింది .

నేను చెబితే మీరు నమ్మరేమో కానీ గత నలబై రోజులుగా కరోనా ఒక చుట్టు చుట్టేసింది . మన దేశం లో కొన్ని కోట్ల మందికి సోకింది . మొదటి, రెండవ వేవ్ లో నూటికి తొంబై మందికి సోకింది . అటు పైన ఈ సంవత్సరం జనవరి నెలలో ఓమిక్రాన్ రూపం లో నూటికి తొంబై అయిదు మందికి సోకింది . గత నలభై రోజుల్లో నూటికి డెబ్భై అయిదు మందికి సోకి వుంటుంది .

అదేంటి కేసులు ఇరవై వేలు దాట లేదు అనుకొంటున్నారా ? కరోనా సోకిందని జనాలు గుర్తిస్తేనే కదా ? గుర్తించినా టెస్ట్ ల కు వెళితేనే కదా ? వెయ్యి మందికి సోకివుంటే ఎవరో ఒక్కరు టెస్ట్ కు వెళ్ళివుంటారు . ఇక కేసులెక్కడ ?

ఒకటి లేదా రెండు రోజుల జ్వరం , కాస్త వొళ్ళు నొప్పులు .. ఇంతే . చాలా మందికి అది కూడా లేదు . ఏదో వొంటిలో కాస్త నలకడ అనిపించివుంటుంది . టెస్టింగ్ లేదు .. ట్రేసింగ్ లేదు .. ట్రీట్మెంట్ లేదు…. క్వరెంటైన్ అసలే లేదు .

ఆకులో ఆకులా ,పువ్వులో పువ్వులా కరోనా సీజనల్ వ్యాధులతో కలిసిపోయింది. నా మాట మీద నమ్మకం లేక పొతే వెళ్లి యాంటీబోడీ టెస్టులు చేయించుకోండి . నూటికి డెబ్భై మందికి యాంటీబోడీ లు .. అవీ కొత్తవి ఉంటాయి .

ఇక ఇంతే సంగతులు . కరోనా అలాగే వస్తూ ఉంటుంది . పోతూ ఉంటుంది .

ఓమిక్రాన్ పోయింది . దాని ఉప వేరియంట్ లు ఇప్పుడు … ఇవి పోతాయి . కరోనా మునిమనవలు.. ముని ముని .. ముని ముని .. మునిమునిముని .. ఇలా వస్తూ ఉంటాయి . కొత్త వారియింట్ వచ్చేస్తుంది అని అని కొంతమంది భయపెడుతూ వుంటారు . పాపం వారి మాట విని భయపడేవారు సంఖ్య రోజురోజుకు తగ్గి పోతోంది .

గడిచిన కాలానికి స్మృతి చిహ్నాలుగా ఇంకా అక్కడక్కడా మాస్క్ పెట్టుకొన్న వాళ్ళు ..” నాకు కరోనా సోకింది క్వరెంటైన్ కు వెళ్ళిపోతున్నాను .. మీరు టెస్ట్ చేసుకోండి” అని చెప్పేవాళ్ళు ..

పాపం అనిపిస్తుంది . వారిది అంతరించి పోతున్న తెగ .

అన్నట్టు ఇంకో విషయం . నిన్నటి దాక వాక్ సీన్ లు హార్లిక్స్, బూస్ట్ లాగా బలాన్ని ఇస్తాయి వేసుకోండి అని ప్రచారం చేసిన మేధావులు మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్నారు . వద్దు .. అవసరం లేదు .. అని చెప్పడం మొదలు పెట్టారు . జ్ఞానోదయమో లేక జనాల్లో క్రెడిబిలిటీ దెబ్బ తింటుందనుకొన్నారో తెలియదు . ఏది ఏమైనా మంచి పరిణామం .

Amarnath vasireddy

You missed