ఓమిక్రాన్ వచ్చి ఆరు నెలలు అయ్యింది. అంటే ఓమిక్రాన్ సోకడం వల్ల వచ్చిన యాంటీబోడీ లు అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరోనా మళ్ళీ సోకె అవకాశం ఉంది. కేసులు పెరుగుతాయి.

కరోనా సోకడం వల్ల వచ్చే యాంటీబోడీ లు మన సంపాదించుకొన్న డబ్బు లాంటిది. ఖర్చు అయిపోతాయి. కానీ కరోనా సోకడం వల్ల మనకు వచ్చే టి సెల్స్ రక్షణ మన విద్యా సంపద లాంటిది. అది ఖర్చు కాదు. జీవితాంతం మన వెన్నంటి ఉంటుంది.

చాలా మందికి మొదటి రెండు వేవ్ లలో సోకింది. లేదా ఓమిక్రాన్ సోకింది. గతం లో సోకినా లక్షణాలు లేకుండా బయటపడిన వారు తమకు సోకలేదని అనుకొంటున్నారు. మన దేశ జనాభా లో తొంబై అయిదు శాతానికి కనీసం ఒక సారి సోకి టి సెల్స్ రక్షణ వచ్చింది.

కాబట్టి ఇప్పుడు సోకినా ఏమీ కాదు. కాస్త జలుబు. కాస్త ఒళ్ళు నొప్పులు. టెస్ట్ లు అక్కర లేదు. ఆసుపత్రి లో చేరే అవసరం ఉండదు. భయపడే వారిని దేవుడు కూడా రక్షించ లేడు.

ఇక పై సంవత్సరానికి ఒక సారో రెండు సార్లో కరోనా సోకుతూ ఉంటుంది. దాని పని సోకడం. మన పని దాన్ని పట్టించుకోక పోవడం. ఇప్పుడు కరోనా జలుబు లాంటిది. హైరానా పడేవారికి చెప్పండి.

ఇక వాక్ సీన్ ల గురించి చెప్పేది ఏముంది ? చూస్తున్నారుగా ? ప్రతి రోజు గుండెపోట్లు. మినిస్టర్ ల కే దిక్కులేదు. పాపం. అయ్యా మీకు తెలిసిన వారు అకస్మాత్తుగా గుండెపోటు తో చనిపోతే కనీసం అప్పుడైనా నలుగుర్నీ అప్రమత్తం చెయ్యండి. ఇక వాక్ సీన్ లు వద్దు అని చెప్పండి.

Amarnath Vasireddy