భార‌తీయ జ‌న‌తా యువ‌మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేర‌కు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. మొన్న నిజామాబాద్‌లో, రెండు రోజులుగా క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. వెంట‌నే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి 33 నెల‌లు గ‌డిచినందున‌.. ఈ 33 నెల‌ల భృతిని మొత్తం ఒకేసారి చెల్లించాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్య‌దర్శి ప‌టేల్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ వేడి రాజుకుంటున్న త‌రుణంలో నిరుద్యోగ స‌మ‌స్య‌పై బీజేవైఎం చేస్తున్న ఆందోళ‌న‌లు ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారాయి.

You missed