తెలంగాణ సమాజంలో 18%మున్న దళిత సమాజాన్ని ప్రలోభాలకు గురిచేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే కుట్రలకు కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలకు, విశ్వ జ్ఞాని భారత రత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ నిజమైన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న దళిత సమాజం ఎన్నటికి లొంగదు.

★దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వక పోగా.. రాష్ట్రంలో దళిత బహుజన ప్రజలపై జరిగిన హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమైన విషయం తెల్సిందే…

★ ఎంబీసీ కార్పొరేషన్ జాడేది…!

దళిత సమాజం కంటే అత్యంత అవమానకర రీతిలో బతుకుల వెల్లదీస్తున్న సంచార జాతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు కేసీఆర్
కాని ఒక్క రూపాయి ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ కు ఐదువేల కోట్ల రూపాయలు నిధులు విడుదల కేటాయించినట్లు గత బడ్జెట్ లోనే ప్రకటించారు కేసీఆర్. బీసీ కార్పొరేషన్ కు కూడా ఒక్క రూపాయి విడుదల చేసిన దాఖలాలు లేవు.

★ సామాజిక, రాజకీయ చైతన్యం లేని బీసీ సమాజాన్ని గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల కంటే
కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వంచనకు గురిచేసిన విషయం తెల్సిందే.
★ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం నుంచి జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్ల ప్రతిఘటన ఇంద్రవెల్లి వీరుల చరిత్రకు చిరునామాగా నిల్చిన, దళిత జాతి త్యాగాల పునాదులపై ఆధిపత్య కులాలు,తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత రాజకీయ అధికారాన్ని సుస్థిరాన్ని పర్చుకోవాడానికి
దళిత సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేసే కుట్రలకు తెరలేపారు కేసీఆర్.

 

దళిత బంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలని  తెలంగాణ సీపీఎం డిమాండ్ ఆశ్చర్యం కలిగిస్తోంది…!
కేసీఆర్ ఆధిపత్య దోపిడి వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో సీపీఎం నేతలు,
దళిత బంధులో మార్క్సిజం ద్వారా ఏర్పడే సమసమాజం కనిపించడం విస్మయం కలిగిస్తోంది.

 

తెలంగాణ సీపీఎంలోని బహుజన కామ్రేడ్స్ ఆలోచించండి…!

సీపీఎం కేంద్ర కమిటీ రాజకీయ తీర్మానాన్ని తుంగలో తొక్కి కేసీఆర్ ఆధిపత్య రాజకీయ భవిష్యత్తుకు
భరోసాగా నివ్వబోతున్న తెలంగాణ సీపీఎం నాయకత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది…!

తెలంగాణ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బిసి,అగ్రకుల పేదలతోకల్పి 98% బహుజనులు ఆ బహుజనులే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలని సామాజిక న్యాయ సాధన పాదయాత్ర చేసి, బీఎల్ఎఫ్ ఏర్పాటులో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సీపీఎం సామాజిక న్యాయానికి పాత్రవేసి ఆధిపత్య దోపిడీ కులాలను సంపన్నులను చేస్తూ, బహుజన జాతులను శాశ్వతంగా రాజకీయ బానిసలుగా మార్చే
కుట్రలకు పునాదులు వేస్తున్నతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి తెలంగాణ సిపిఎం అంటకాగే ప్రయత్నం చేయడం.. ఆ పార్టీ రాజకీయ దివాలాకోరు విధానం మరోసారి నవ్వులు పాలయ్యింది.
రాబోయే ఎన్నికల్లో ఒకటో రెండో కేసీఆర్ విదిలించే ఎమ్మెల్యే సీట్ల కోసం తెలంగాణ సీపీఎం రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర శాఖను గైడ్ చేస్తున్న పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బీవీ రాఘవులు కేంద్ర కమిటీ రాజకీయ విధానానికి భిన్నంగా టీఆర్ఎస్ తో మైత్రీకి చేస్తున్న ప్రయత్నాలు సీపీఎం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్, ఇతర ప్రజాస్వామిక రాజకీయ శక్తులతో అనుకుల వైఖరికి వ్యతిరేకంగా ఉంటు
తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ తో బంధం ఎందుకో? తెలంగాణ సీపీఎంలోని బహుజన కామ్రేడ్స్ తోపాటు బహుజన దృక్పథం కలిగిన కామ్రేడ్స్ గుర్తించాలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

సామాజిక చైతన్యం కలిగిన దళిత బహుజన సంఘాల నాయకులు ముఖ్యంగా ఐపీఎస్, ఐఎఎస్
అధికారులు అకునూరి మురళి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ లాంటి సామాజిక మార్పుకోసం ఉద్యమిస్తున్న మాజీ ప్రభుత్వ అధికారులు దళిత బంధు దళితులను ఆర్థిక అభివృద్ధి చేయజాలదని బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దళిత బంధులో సోషలిజాన్ని చూస్తున్నవారు మాత్రం సీపీఎంకు కాబోయే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ప్రచారం పొందుతున్న బి.వెంకట్,
ప్రస్తుత కార్యదర్శి తమ్మినేని వీర‌భ‌ద్రం లు మాత్రమే కేసీఆర్ దళిత బంధు అల్లావుద్దీన్ అద్భుత దీపమంటూ తెగ ప్రచారం చేస్తున్నారు.

★ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేస్తామని ప్రగల్భాలు పలికిన
ఉభయ వామపక్షాలు వారి ప్రకటనల సిర ఆరకముందే సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తో రాజకీయ వియ్యం అందుకున్నారు.

★దళిత బంధుతో నిజంగా దళితుల ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి కూడా నమ్మకం లేదు. కానీ కొంతమంది నాయకుల వ్యక్తిగత ప్రయోజనం కోసం వారి కీర్తి ఖండుతి కోసం కాకపోతే, తెలంగాణ సమాజంలో 93% మున్న బహుజనుల్లో 90%శ్రామిక వర్గాలే ఆ వర్గాలను మార్క్సిస్టు ఆలోచన విధానం ఆధారంగా పార్లమెంట్, పార్లమెంట్ యేతర ప్రజా క్షేత్రంలో ఉద్యమాల ద్వారా సిపిఎం సిద్ధాంతం ప్రకారం కార్మిక వర్గ దృక్పథంతో అధికారంలోకి రావడానికి కృషి చేయాలసింది పోయి, ఆధిపత్య దోపిడి వర్గాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీలతో ఇంకెంతకాలం వియ్యమందుకుంటారు…? ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలతో ఏదో ఒక సందర్భంలో పార్టీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో రాజకీయ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు లేకుండా అడుగు ముందుకు కదలలేని దుస్థితి వామపక్ష పార్టీల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీపీఎం,సీపీఐ పార్టీల్లోని ఆత్మగౌరవమున్న బహుజన కామ్రేడ్స్ ఆయా పార్టీల్లో ని నాయకత్వం అనుసరిస్తున్న ఆధిపత్య కులాల దోపిడి విధానాన్ని సమర్ధించే, మార్క్సిస్టు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం ద్వారా ఓడించాలసిన అవసరాన్ని గుర్తించాలి.

ఇప్పటికే రాజకీయంగా పరువు పోగొట్టుకున్న వామపక్షాలు ఉనికినిసైతం కాపాడుకొలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.

★సీపీఎం, సీపీఐ లు అనుసరిస్తున్న రాజకీయ విధానం మార్క్సిస్టు రాజకీయ విధానాలకు
పూర్తి వ్యతిరేకమైనవి…!!!

పాలక వర్గాలు అనుసరిస్తున్న ఆధిపత్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రత్యామ్నాయాన్ని
నిర్మించాలసిన వామపక్షాలు పెరుగుతున్న ప్రజా ఉద్యమాలను చావుదెబ్బ తిసేవిధంగా ఒకటి అరా సీట్ల కోసం,పార్టీ ఆఫీస్ లకు స్థలాల కోసం అందులో కోట్ల రూపాయల విలువ చేసే భవనాల నిర్మాణం కోసం సంవత్సరాల తరబడి పార్టీ క్యాడర్ ను నిధుల కోసం తిప్పినంతగా ప్రజా క్షేత్రంలో ఉంచి ఉంటే

తెలంగాణ లాంటి రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రంలో ప్రజా ప్రత్యామ్నాయ నిర్మాణం జరిగేది.
★ తెలంగాణ సమాజంలో 93%మున్న దళిత బహుజన జాతులు పాలకులుగా మారినప్పుడు మాత్రమే దళిత బహుజన ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విముక్తి జరుగుతుంది…

దండి వెంకట్

వర్కింగ్ ప్రెసిడెంట్
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి
తెలంగాణ రాష్ట్ర కమిటీ, హైదరాబాద్.

You missed