దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ సీటు రెడ్డికే కన్పాం అయ్యింది. అయితే జీవన్‌రె్డ్డి లేకుంటే సునీల్‌రెడ్డి.. మొత్తానికి ఏదో ఒక రెడ్డికే ఫైనల్ చేసే వీలుంది. బరిలో ఉన్న బీసీలకు అధిష్టానం చెక్‌ పెట్టింది. పద్మశాలి వర్గం నుంచి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ సీరియస్‌గా ట్రై చేశాడు. అతనికి మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరీ అప్పగించి పక్కకు తప్పించేశారు. ఇక మున్నూరుకాపుల కోటాలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా బాగానే ట్రై చేసింది. కానీ తాజాగా పార్టీలో చేరిన దానం నాగేందర్‌ మున్నూరుకాపు వాడే. అతనికి సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇస్తున్నారు. దీంతో ఈ సమీకరణను ముందు పెట్టి ఆకులకు చెక్‌ పెట్టారు.

ఇప్పుడు రెడ్లకే టికెట్ అంతే. వేరెవరూ లేరనే విధంగా సీన్‌ క్రియేట్ చేసింది రేవంత్‌ టీమ్‌. జగిత్యాల జీవన్‌రెడ్డి పేరును మొదటనే ఖరారు చేశారు. కానీ అతనికి ఇవ్వడం పట్ల కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకు చెందిన వారిలో ముత్యాల సునీల్‌రెడ్డి పేరును కూడా అధిష్లానం పరిశీలిస్తోంది. ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తారు. కాస్త టైం తీసుకునే వీలుంది.

 

You missed