దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

బాల్కొండ నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో కేంద్ర బిందువైంది. ఇక్కడ గెలిచింది మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కానీ అక్కడ ఆయన చెప్పిందేం నడవడం లేదు. అక్కడ షాడో ఎమ్మెల్యే ముత్యాల సునీల్‌రెడ్డి. అంతా తానై నడిపిస్తున్నాడు ఓడినా కూడా. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం తాజాగా ప్రకటించిన కార్పొరేషన్‌ చైర్మన్లలో ముగ్గురూ ఈ నియోజకవర్గం వారు కావడమే విశేషం. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి ఇక్కడి నుంచే టికెట్ ఆశించాడు. అతనికి కో ఆపరేటివ్‌ యూనియన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చేశారు. మొన్నటి వరకు ఏ పదవి లేకపోవడంతో ఆయన నియోజకవర్గానికి దూరంగానే ఉన్నాడు.

కానీ ఆయన మనసంతా నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నది. ఇప్పుడు ఈ చైర్మన్‌ పదవితో ఆయన బాల్కొండలో మళ్లీ తన పట్టుకొనసాగించనున్నాడు. ఇక ఈరవత్రి అనిల్‌. ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే. రెండు సార్లు పోటీ చేసి ఓడిన నేత. బాగా పరిచయాలున్న నాయకుడు. ఇప్పుడు కీలకమైన మైనింగ్ కార్పొరేషన్‌ ఇచ్చారు. తన దృష్టంతా బాల్కొండ పైనే. అలా తన పాత నేతలను, పరిచయస్తులను, కార్యకర్తలను కలుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడక్కడే తిరుగాడుతూ ఉంటాడన్నమాట. ఇక మిగిలింది సుంకెట అన్వేష రెడ్డి. ఈ నేతకూ బాల్కొండ మూలాలే ఉన్నాయి. ఇతనికీ కీలకమైన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ను చేశారు.

ఇక అన్వేష్ కూడా ఇక్కడ పట్టు కోసం కార్యక్రమాలు చేయడం, పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని తన క్యాడర్‌ను క కాపాడుకోవడం చేస్తూ ఉంటాడన్నమాట. ఈ లెక్కన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అటుంచి ఈ నలుగురి పెత్తనం కొనసాగనుంది. నేతలు వర్గాలు విడిపోయి ఎవరికి వారు తమ తమ నేతలతో చక్కర్లు కొడతారన్నమాట. ఇప్పుడిదే టాక్‌ జిల్లాలో.

You missed