కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తానని ప్రకటించడమే పాపమై కూర్చుంది. లోకల్‌ ఎమ్మెల్యే గంప పై తీవ్ర వ్యతిరేకత.. ఎమ్మెల్యే అనుచరుడు ముజీబుద్దీన్‌పై తీవ్ర ఆరోపణలు. వీరికి ఖిలాఫ్‌గా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, సీనియర్‌ లీడర్‌ నిట్టు వేణుగోపాల్‌.. ఇగో ఈ నలుగురు కేసీఆర్‌ కొంప ముంచేలా ఉన్నారు. భారీ మెజారిటీ, దేశం అబ్బురపడే మెజారిటీ .. అంటూ కేసీఆర్‌ ఎంత దిశానిర్ధేశం చేసినా.. ఎన్ని చురకలు పెట్టినా.. ఎంతలా హితబోధన చేసినా ఇప్పటి వరకు ఇసుమంతైనా మార్పు రాలేదు ఈ నేతలకు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. క్యాడర్‌లో అదే అయోమయం. కేటీఆర్‌కు ఇదిప్పుడు ఓ పే..ద్ద తలనొప్పి. అందుకే బుధవారం మళ్లీ కామారెడ్డిలో ఈ నేతలందరితో రహస్య సమావేశం ఏర్పాటు చేసి ఘా…ట్టి వార్నింగ్‌ ఇవ్వనున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక్కడే కాదు.. దేశంలోనే పార్టీ ఇజ్జత్‌ పోతదనే రీతిలో ఆయన అందరికీ చురకలంటించే అవకాశం ఉంది. మొన్న కేటీఆర్‌ బహిరంగ సభ పెట్టి నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. లోకల్‌ ఎమ్మెల్యే గంప గోవర్దన్, ముజీబుద్దీన్‌ ఒక జట్టు. మున్సిపల్ చైర్మన్‌ నిట్టు జాహ్నవి, సీనియర్‌ లీడర్‌ నిట్టు వేణుగోపాల్‌ వీరికి వ్యతిరేక కూటమి.

దీంతో ఎవరికి వారే అయ్యారు. సమన్వయం లేదు. కలుపుకుని పోయే మనస్తత్తం అంతకన్నా రాలేదు. రాదు. మరి ఇలాగే ఉంటే.. కేసీఆర్‌ కొంప మునగడం ఖాయం. ఇదే విషయాన్ని ముందుగానే కేటీఆర్‌ గమనించాడు. అందుకే మరోమారు బుధవారం మీటింగు పెట్టనున్నాడు.

You missed