చిత్తం విఠలేశ్వరుడి మీద… భక్తి టికెట్‌ వస్తుందా లేదా డౌట్‌ మీద…

పండరీనాథ్‌ యాత్ర తర్వాత

ఇక టికెట్ల పండుగే… ఆషాఢం తర్వాత కొన్ని సిట్టింగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన…

పెండింగ్‌ స్థానాలు.. సిట్టింగులకు డౌటేనని పరోక్ష సిగ్నల్‌..

అయితే కాంగ్రెస్‌, లేదా బీజేపీ… దారి వెతుక్కుంటున్న బీఆరెస్‌ నేతలు….

కేసీఆర్‌ బలగం మహారాష్ట్ర బయలుదేరింది. మంగళవారం రాత్రి అర్థారత్రికి చేరుకుంటుంది. పండరీనాథ్‌ విఠలేశ్వురుడు, తుల్జాభవానీ మాత దర్శనం చేసుకుని అధినేతత్ సహా తిరిగి వస్తారు. ఇది కాదు అసలు ముచ్చట. త్వరలోమ కేసీఆర్‌ తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు టికెట్లు అనౌన్స్‌ చేయనున్నాడు. సిట్టింగులకే టికెట్లు అని చెప్పుకుంటూ వచ్చినా దాదాపు 40 మందిని మార్చే అవకాశం ఉంది. ఈ ఆషాఢ మాసం వచ్చే నెల 17తో ముగుస్తుంది. మంచి ముహూర్తం చూసుకుని కొన్ని సీట్లకు అభ్యర్థులను డిక్లేర్‌ చేస్తాడు కేసీఆర్‌. పండరీనాథ్‌ టూర్‌కు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలలో ఇదే గుబులు.

చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అన్నట్టు.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలోమని మహారాష్ట్ర తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యేలందరికీ గుబులుగానే ఉంది. నాకు వస్తుందా..? ఫస్ట్‌ లిస్టులో నా పేరుంటుందా..? నా వారుసుడికి అవకాశం దక్కేనా..? రెండో లిస్టు పేరుతో పెండింగ్‌లో పెట్టేస్తాడా.?? అవే అనుమానాలు. టెన్షన్‌ నశాలానికి అంటింది. భక్తి మాట విఠళేశ్వరుడు ఎరుగు… కేసీఆర్ మనసులో తన పట్ల ఏ అభిప్రాయముందో…. టికెట్‌ వస్తుందో లేదో అనే అనుమానంతో రాత్రిళ్లు నిద్రలేకుండా పోతుందట బీఆరెస్‌ ఎమ్మెల్యేలకు. ఒకవేళ ఫస్ట్‌ లిస్టులో తమ పేరు లేకపోతే.. ఇంక అంతే సంగతులని డిసైడ్ చేసుకోవాల్సిందేననే అభిప్రాయానికి వచ్చారు. మరి అలా అయితే ఏ పార్టీ ఎంచుకోవాలే…? కాంగ్రెస్‌ బెటరా..? బీజేపీ బెటరా..? ఎవరు నమ్ముతారు..? ఎవరు దగ్గరకి రానిస్తారు..? ఇలాంటి సమీకరణాలు కూడా చేసుకుంటున్నారు.. విఠలేశ్వర మందిరం సాక్షిగా.

You missed