తెలంగాణ యూనివర్సిటీని భ్రష్టుపట్టించిన వీసీని కటకటాలకు పంపిని ప్రభుత్వం.. దీన్ని చక్కదిద్దేందుకు ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ ను వీసీగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మొదట విద్యాశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ వాకాటి కరుణను నియమించాలని భావించారు.ఆమెకు ఉండే అదనపు బాధ్యతల రీత్యా… వేరొక ఐఏఎస్‌ ఆఫీసర్‌ను వీసీగా నియమిస్తే పరిస్థితులు చక్కబడతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రొఫెసర్లను వీసీలుగా నియమిస్తే ఇక్కడ పాలన భ్రష్టు పట్టిస్తున్నారనే భావనలో ప్రభుత్వం ఉంది. అందుకే పోయిన పరువును కాపాడేందుకు, పరిస్థితిని చక్కదిద్ది పూర్వవైభవం దిశగా వర్సిటీని అడుగులు వేయించేందుకు కచ్చితంగా ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌నే నియమించాలని భావిస్తున్నారు.

You missed