ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో ముందుండాలి: బాజిరెడ్డి గోవర్దన్‌

నిజామాబాద్‌ రూరల్: ముదిరాజ్‌ కులస్తులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆకాంక్షించారు. జక్రాన్‌పల్లి మండలంలోని కేశ్‌పల్లి గ్రామంలో ముదిరాజ్‌ కులదైవమైన పెద్దమ్మతల్లి దేవాలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రహారీ గోడ నిర్మాణం కోసం ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి ఐదు లక్షలను కేటాయించి ఉన్నారు. ఈ పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దమ్మ తల్లి దీవెనలు ప్రతీ ఒక్కరి మీద ఉంటాయని, తను గ్రామ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలబడతానని అన్నారు. ఈ సమావేశంలో ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, కేశ్‌పల్లి సర్పంచ్‌ మైదం మహేశ్వర్‌, సీనియర్‌ జర్నలిస్టు యాటకర్ల మల్లేశ్‌, ఎంపీటీసీ మున్నూరు గంగాధర్‌, పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ చైర్మన్ యాటకర్ల దేవేశ్‌, క్యాషియర్‌ యాటకర్ల శ్రీధర్‌, క్రాంతి, ఎర్రోళ్ల ప్రశాంత్‌, హరీశ్‌, నరేందర్‌, మహేందర్‌, సాయిలు,యాటకర్ల అవినాశ్‌, జనార్ధన్‌, మాజీ ఎంపీపీ మైదం రాజన్న (కాంట్రాక్టర్‌), మాజీ ఎంపీపీ అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి బాజిరెడ్డి 25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

You missed