అది జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం. నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కు శంఖుస్తాపన. పిట్లంలో బహిరంగ సభ. కేటీఆర్‌ ముఖ్య అతిథి. ఈ సభ వేదికగా కేటీఆర్‌ తన విశ్వరూపాన్ని చూపాడు. ఇ మాజీష్యూ లోకల్‌దే అయినా అన్ని అంశాలపైన తనదైన శైలిలో స్పందించిన కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఎవరినీ వదల్లేదు. జుక్కల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం మొదలు మోడీ వరకు అందరిపై నిప్పులు చెరిగారు. ధ్వజమెత్తారు. దునుమాడాడు. తిట్టిపోశాడు. సవాల్‌ విసిరాడు. ఇజ్జత్‌ తీశాడు. సెటైర్లు వేశాడు.

మొదట జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మెచ్చుకోలుతో ప్రారంభించిన కేటీఆర్‌.. వరుసగా ప్రతిపక్షాల, పార్టీల తీరును ఎండగట్టడమే కాదు.. ఏకిపారేశాడు. తన వాగ్దాటితో దుమ్మురేపాడు. అంతా పిన్‌డ్రాప్‌ సైలెంట్‌. తన మాటల, తూటాల దూకుడుతో అక్కడ సభ ఆసాంతం ఆసక్తిగా విన్నారు. అక్కడి ప్రజల రోమాలు నిక్కబొడుచుకునేలా ఆయన ప్రసంగం ఆసాంతం సాగింది. ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. మొదట రేవంత్‌రెడ్డి పాదయాత్ర గురించి తీశాడు. ఒక్కచాన్స్‌ అని అడుగుతున్నాడు. యాభై ఏండ్లు చాన్సులు ఇస్తే గాడిది పండ్లు తోమారా అంటూ తిట్టిపోశాడు.

ఓ పిట్టకత కూడా చెప్పి ఆకట్టుకున్నాడు. బాగా చెడుతిరుగుళ్లకు తిరిగి చెడిపోయిన ఓ యువకుడు తల్లిదండ్రిని చంపితే.. జడ్డి మాట్లాడుతూ ఎంతో మంది లత్కోర్‌, బద్మాష్ గాండ్లను చూశాను.. ఆఖరిని రేవంత్‌రెడ్డిని కూడా చూశాను. కానీ నీ లాంటి చిల్లరగాన్ని మాత్రం చూడలేదని తిట్టాడని.. రేవంత్‌ను ఘోరంగా అవమానించే రీతిలో మాట్లాడి చర్చకు తెరలేపాడు. ఇక బండి సంజయ్‌ .. మోడీని దేవుడంటున్నాడని, ఎవడికి దేవుడు వాడు.. అంటూ ఘాటుగానే స్పందించాడు. పెట్రోల్‌ రేట్లు, గ్యాస్‌ రేట్లు అన్నీ పెంచి పేదల నడ్డి విరుస్తున్న మోడీ అదానికి దేవుడు మాకు కాదంటూ నిప్పులు కక్కాడు. వీరికి కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. కవిత ఇష్యూపై పరోక్షంగా కేటీఆర్‌ స్పందించాడు. ఈడీ బోడీలకు భయపడేది లేదని ఏం పీక్కుంటారో పీక్కోండని సవాల్‌ విసిరాడు.

You missed