ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి అంకాపూర్‌ గ్రామానికి చెందిన పైడి రాకేశ్‌రెడ్డి పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. తన జన్మదినం సందర్బంగా ఈ విషయాన్ని ఆయన తన ఆత్మీయులతో పంచుకున్నాడు. జీవన్‌ రెడ్డి అక్కడ జనాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఇక్కడ మార్పు అవసరమని ఆయన మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. తన కష్టపడి పైకి వచ్చానని, రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజలకు మరింత సేవల చేయాలనే ఆలోచన ఉందన్నాడు.

జనాల్లో ధైర్యం నింపేలా తనే ఓ శక్తిగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటానన్నాడు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ నియోజకవర్గం అంతా పలు చోట్ల ఫ్లెక్సీలతో హల్‌ చేశారు రాకేశ్‌ రెడ్డి అభిమానులు. అన్నదానాలు, స్వచ్చంధ రక్తదానాలు చేశారు. ఆర్మూర్‌ పై ఇప్పటికే పలువురు నజర్ పెట్టారు. బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాకేశ్‌ రెడ్డి కూడా బీజేపీ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నాడు. కాగా తన రాజకీయ ఆరంగేట్రం త్వరలో ఉంటుందని మాత్రం ఈ వేదికగా అనౌన్స్‌ చేయడంతో అక్కడ చర్చ మొదలయ్యింది.

 

You missed