రోబోల‌తో ఓ హోట‌ల్ న‌డిపితే ఎలా ఉంటుంది. కొత్త‌గా, ఆసక్తిగా, వినూత్నంగా. ఇదే ఆలోచ‌న వ‌చ్చిందో యువ‌కుడికి. అత‌ని పేరు మ‌ణికాంత్ గౌడ్‌. హైద‌రాబాద్‌లోని కొత్త‌పేట‌లో చిట్టీ ఇన్ టౌన్ అని ఓ హోట‌ల్‌ను ప్రారంభించాడు. మొత్తం నాలుగు రోబోల‌ను తెప్పించాడు. అమ్మాయిలా ముస్తామైన ఓ మూడు రోబోలు, ఒక‌టి రోబో ఆకారంలో. స‌ర్వ‌ర్ ముందుగా వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద ఆర్డ‌ర్ తీసుకుంటాడు. ఆ త‌ర్వాత ఓ ట్రేలో వాటిని రోబోలు తీసుకువ‌చ్చి ఆ టేబుల్ వ‌ద్ద ఆగుతాయి. స‌ర్వ‌ర్ వాటిని వ‌డ్డిస్తాడు. అవి అక్క‌డ్నుంచి వెళ్లిపోతాయి. రోబో సినిమాలో ర‌జినీ పాత్ర సృష్టించిన చిట్టీ అనే పేరు గ‌ల రోబో ఈ కాన్సెప్టుకు స్పూర్తి. ఆలోచ‌న వినూత్నంగా ఉండి అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో దీనికి విప‌రీత‌మ‌న గిరాకీ కూడా వ‌స్తుంద‌ట‌. ఈ హోట‌ల్ పెట్టి మూడు నెల‌లే అవుతున్నా.. ఆ నోటా.. ఈ నోటా అంద‌రికీ తెలిసిపోతున్న‌ది.

You missed