ఆపిల్ ఐఫోన్ 11 మోడ‌ల్ ఫోన్‌ను కంపెనీ వాడు 24 వేల‌కే అమ్ముతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అవునా..? అంత త‌క్కువకేనా? ఐతే మ‌నం తీసుకోవాల్సిందే అనుకుంటున్నారు. కొంచెం ఆగండి. ఇక్క‌డ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి అని కూడా అంటున్నాడు. దీని ఒరిజ‌న‌ల్ రేట్ రెండు నెల‌ల కింద 50వేలు, ఇప్ప‌డు 39వేలు చేశారు. కానీ ఎక్స్చేంజ్‌ ఆఫ‌ర్ కింద మీ ఫోన్ వ్యాల్యూ తీసేసి … ఆ మిగిలిన మొత్తం చెల్లించాల‌న్న‌మాట‌. ఇదీ కండిష‌న్‌. అయినా స‌రే భ‌లే ఆఫ‌ర్ అంటారా? అయితే మిమ్మ‌ల్ని ఆపేదెవ‌రు? వెళ్లండి. పాత‌దిచ్చేసి.. ఈ కొత్త ఆపిల్ ప‌ట్టుకొచ్చుకోండి. పండుగ ఆఫ‌ర్ మ‌రి. ఆల‌స్య‌మెందుకు?

You missed