బంగారం ధర గత నెల రోజులలో దాదాపు రూ.1400 త‌గ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 నుంచి రూ.46,960కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,300 నుంచి రూ.43,050కు క్షీణించింది. అంటే రూ.1200కు పైగా దిగొచ్చింది.

బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా ప్ర‌యాణించింది. వెండి ధర మరింత పడిపోయింది. వెండి రేటు గత నెలలో కేజీకి రూ.68,700 నుంచి రూ.63 వేలకు ప‌డిపోయింది. అంటే రూ.5 వేలకు పైగా ధ‌ర‌ పతనమైంది. అంటే బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి త‌రుణం చెప్పొచ్చు.

You missed