కేసీఆర్ మారాడు. ఇచ్చిన హామీల‌న్నీ నేర‌వేర్చాల‌నుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు వాటిని విస్మ‌రించాడు. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వాటిని జ్ఞాప‌కం చేసుకుంటున్నాడు. ఏనాడో ఇచ్చిన ఆ హామీల అమ‌లుకు ఇప్పుడు త‌న‌ది బాధ్య‌త అంటున్నాడు. మెల్ల‌మెల్ల‌గా ఒక్కొక్క‌టిగా వాటిని పట్టాలెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్పుడే ఇవ‌న్నీ ఎందుకు జ‌రుగుతున్నాయి అనుకుంటున్నారా? ప‌డ‌కేసిన ప‌థ‌కాల అమ‌లలో చ‌ల‌నం ఎందుకొచ్చాయ‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అంతా ‘హుజురాబాద్’ మాయ.. రాబోయే ఉప ఎన్నిక భ‌యం, బ్రాంతి. ఏదేమైనా హుజురాబాద్‌కు న‌మ‌స్తే పెట్టాలే.
తాజాగా కేసీఆర్ రైతు రుణ మాఫీ కింద 50 వేల రూపాయల చొప్పున రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. లక్ష రుణమాఫీ నీ ఇలా కిస్తీ ల లెక్కన విదుల్చుతున్నాడు. సరే.. కానీ. ద‌ళిత‌బంధు కింద ప‌ది ల‌క్ష‌లు ఇస్తామ‌ని, హుజురాబాద్ లొనే పైలెట్ ప్రాజెక్టు కింద అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించి ప‌రేషాన్‌లో ప‌డ్డాడు కేసీఆర్‌. ఇక్క‌డ ఎన్నిక‌ల్లో గెలుపు తీరాల కోసం క‌ల‌లు కంటూ ప‌డ‌కేసిన ప‌థ‌కాలకు ప‌రుగులు పెట్టించిన వైనాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. నిల‌దీస్తున్నారు. ప్ర‌శ్నిస్తున్నారు. వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రి పాత‌వాటి సంగతేంటి? అని కేసీఆర్‌ను అడుగుతున్నారు. అందుకే ఉన్న‌
పలంగా అప్పుడు అధికారంలోకి వ‌చ్చేందుకు ఇష్టారీతిన ఇచ్చిన హామీల అమ‌లు కోసం ఇప్ప‌డు చ‌మ‌టోడుస్తున్నాడు. ఇదంతా హుజురాబాద్ ద‌య. మంచిదే. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగే సంద‌ర్భం ఇది. అలాగే అదే నోటితో ….
పెండింగ్లో ఉన్న పింఛ‌న్ల‌కు,
కొత్త పింఛ‌న్ల అమ‌లుకు,
బీడీ జీవ‌న‌భృతి ఇచ్చేందుకు,
సొంత స్థలంలో ఇల్లు క‌ట్టుకునేందుకు ఇచ్చే ఐదు ల‌క్ష‌లు,
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల క‌ల్ప‌న‌…
ఇవ‌న్నీ,
ఇవ‌న్నీ అమ‌లు చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు సారూ. మీకు కావాల్సింది హుజురాబాద్‌లో గెల‌వ‌డం. గెలిపిస్తాం. కానీ గ‌తంలో నీ నోటి వెంట రాలినా ఆణిముత్యాలంటి హామీల ప‌థ‌కాల అమ‌లుకు జ‌ర్ర చొర‌వ తీసుకొండి సారూ. మీ బాంచెన్. నీ కాల్మొక్కుతాం.

You missed