Tag: cm kcr

ఇంతకు ఈటల ఎవరి వాడు.? … శాసస సభ సమావేశాల్లో అనూహ్య పరిణామాలు… అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం.. బీఆరెస్‌ మైండ్‌ గేమ్‌.. విఫలైమన ప్రతిపక్షాలు , మైండ్‌ గేమ్‌ అంటున్న ఈటల….

ఈ బడ్జెట్‌ సమావేశాలు కొన్ని అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఈటల రాజేందర్‌కు, సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు మధ్య జరిగిన సంభాషణలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. ఒక దశలో ఈటల…

లక్ష రూపాయల చెప్పులు…. అసెంబ్లీలో మల్లారెడ్డి మాటలు తీవ్ర దుమారం… బీఆరెస్‌ ఎమ్మెల్యేల ఇజ్జత్‌ తీసుకుంటున్న ఆ పార్టీ నాయకులే.. ఇప్పుడున్న వ్యతిరేకత చాలదంటూ తమకు తామే గొయ్యి తొవ్వుకుంటున్న అధికార పార్టీ…

సందర్భమేంటో తెలియదు..ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అవి అన్యపదేశంగా వస్తాయో… అప్పటికప్పుడు వస్తాయో.. ముందే అనుకుని మాట్లాడతారో… అవగాహన లేకనో… మిడిమిడి జ్ఞానమో…. ఏదైతే ఏమిగానీ.. మాట్లాడింది మాత్రం వాస్తవం. ప్రజల ముందు ఉన్నదున్నట్టు చెప్పుకోవడం కూడా ఓ కళ. ప్రజలకూ…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

3 లక్షల కోట్ల ఎన్నికల భారీ బడ్జెట్‌… మరిన్ని అప్పులు తప్పవా..? రేపటి బడ్జెట్‌ అంచనాలపై సర్వత్రా ఆసక్తి… సంక్షేమానికి పెద్ద పీట. అభివృద్ధి, సంక్షేమానికి మధ్య కొరవడిన సమతుల్యత… కేంద్రం మొండిచెయ్యి… ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిసారీ సవరణలు..

ఎన్నికల సంవత్సరం ముంచుకొస్తున్న తరుణంలో రేపు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కీలకం కానుంది. ఈ బడ్జెట్‌ ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌ మొత్తం ౩ లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గత…

తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల పట్ల సీఎం కేసీఆర్‌ ప్రవర్తించిన తీరు పచ్చిద్రోహం…ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం… ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన

మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ…

ఇంటి కోసం మూడు లక్షలు.. వలస జనం హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు… సొంతూళ్లకు రప్పిస్తున్న సర్కారు సొంతింటి నిర్మాణ పథకం…

వాళ్లంతా పొట్ట చేతబట్టుకొని భాగ్యనగరానికి వచ్చినవారు. కడుపు తిప్పల కోసం ఉన్న ఊళ్లో ఉపాధి లేక రాజధాని బాట పట్టిన వాళ్లు. ఇక్కడ కిరాయిలు కట్టలేక, పెద్దగా ఆదాయం లేకపోయినా.. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో కాపురాలు చేస్తూ ఆలుమగలు కంపెనీలలో జీతగాళ్లుగా,…

వాస్తవం వెబ్‌సైట్‌పై నమస్తే తెలంగాణ కేసు… సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు…. ఉన్నదున్నట్టు చెబితే కేసులు.. జైలు…

నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్లుగా అల్లం నారాయణ, కట్టా శేఖర్‌ రెడ్డిలు ఉన్నప్పుడు ఆ పత్రిక గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదో ఉద్యమ పత్రిక. దాన్ని నమ్ముకుని చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ముందుకు వచ్చారు. తక్కువ…

నమస్తే తెలంగాణ పరిస్థితి ఇంత దారుణమా..? ఫోటో ఏందీ..? రైటప్‌ ఏందీ..?? సెంట్రల్‌ డెస్క్‌లో అసలు ఏం జరుగుతోంది..? ఎంత మంది రాజీనామా చేశారు..? ఎవరున్నారు..? ఎవరుంటారు..? ఎడిటర్‌ ఏం చేస్తున్నాడు..? సీఎం కేసీఆర్‌ సీరియస్‌…

నమస్తే తెలంగాణలోని వార్త ఇది. మొన్న పీవీ వర్దంతి సందర్బంగా వచ్చినది. నివాళులర్పించింది బీఆరెస్‌ నాయకులు.. అందులో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, పీవీ తనయ, ఎమ్మెల్సీ శ్రీవాణి కూడా ఉన్నారు. కానీ ఈ ఫోటో కింద ఉన్న రైటప్‌ మాత్రం కాంగ్రెస్‌…

పైలట్‌ రోహిత్‌ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం…? బేరమాడి.. బెడిసికొట్టి… రాజకీయ ప్రతీకారదాడులకు ఇదో మచ్చు తునక… బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రసవత్తరంగా పొలిటికల్‌ గేమ్‌…

దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్‌ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు…

బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..

తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…