రేవంత్‌కు ఉద్యమకారుల నెలరోజుల గడువు.. చెప్పింది చేస్తావా.. రోడ్డెక్కి ఆందోళనలు చేయమంటావా.. సర్కార్‌కు తెలంగాణ ఉద్యమ సమితి అల్టిమేటం.. ఉమ్మడి జిల్లాలో వంద మందికి పైగా ఇంటిస్థలం కోసం దరఖాస్తులు.. ఫిబ్రవరి ఒకటిలోగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న ఉద్యమకారులు.. కాలయాపన చేస్తే ఇక ఊరుకునేది లేదని హెచ్చరికలు..
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల స్థలాన్ని, చనిపోయిన కుటుంబాలకు 25వేల పింఛన్‌ను ఇస్తామన్న రేవంత్ సర్కార్‌కు జేజేలు పలికారు ఉద్యమకారులు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులకిచ్చే స్కీంను కూడా చేర్చి దరఖాస్తులు తీసుకున్నారు.…
