వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

బీజేపీ తమకు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నది. నామినేషన్ల ఘట్టం ముగిసి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొత్త కొత్త అస్త్రాలను రాజకీయ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థిని కట్టడి చేసేందుకు కొంగొత్త వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అర్వింద్‌ కొత్త నినాదం ఎత్తుకున్నాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి నాన్‌ లోకల్ అనే నినాదాన్ని జనాల మధ్యకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు.

‘ ఎమ్మెల్సీగా గెలిచిన తరవాత ఆయన ఏనాడైనా ఇటు వైపు వచ్చాడా..? నిజామాబాద్‌ జిల్లాలో ఆయన ఎన్నిసార్లు తిరిగాడు…? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన నిరుద్యోగుల గురించి ఏనాడైనా పట్టించుకున్నాడా..?’ అని మాటల దాడి షురూ చేశాడు. బీఆరెస్‌ అభ్యర్థి గురించి తాను మాట్లాడనని చెబుతూనే కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇలా టార్గెట్ చేశాడు అర్వింద్‌.

పరోక్షంగా లోకల్‌గా తనే అందుబాటులో ఉంటాననే ప్రచారం చేసుకోవడంతో పాటు.. జీవన్‌రెడ్డి నాన్‌లోకల్‌.. మనకు అందుబాటులో ఉండడనే సంకేతాలిస్తున్నాడు ఓటర్లకు అర్వింద్‌. దీన్ని కాంగ్రెస్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

You missed