ఇప్పటిదాకా ఒక లెక్క…

ఇక నుంచి ఒక లెక్క..ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌…

ప్రతిపక్షాలతో ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని…

సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా సమన్వయం…

కవిత రాకతో ఇందూరు రాజకీయాల్లో హడావుడి.. పార్టీ శ్రేణుల్లో కదలిక.. కదనోత్సాహం…

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

ఎమ్మెల్సీ కవిత. మొన్నటి వరకు ఇందూరుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎంపీగా ఓడిన తర్వాత ఆమె చాలా కాలం ప్రజలతో మమేకం కాలేరు. ఆ తర్వాత నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయినా మొక్కుబడిగానే ఆమె ఇందూరు రాజకీయాల్లో పాల్గొన్నారు. టీఆరెస్‌.. బీఆరెస్‌గా రూపొందడం.. కేసీఆర్‌ తనవెంట కవితను దేశ రాజకీయాల వైపు తీసుకెళ్లడం.. అక్కడ ఆమె కూడా బిజీబిజీగా ఉండటంతో ఆమెకు,జిల్లా ప్రజలకు, నాయకులకు మధ్య కొంత అంతరం పెరిగిన మాట వాస్తవం. కానీ ఇక ఆమె రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న చందంగా నడుం బిగించారు.

ఇందూరు రాజకీయ కార్యక్షేత్రంలో క్రియాశీల పాత్రను మళ్లీ తీసుకున్నారు. అన్ని సెక్షన్లను కలుస్తున్నారు. సమ్మళనాలతో తన ముద్రను వేసుకుంటున్నారు. ఆర్మూర్‌ నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఆమె ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొననున్నారు. జూన్‌ 2 నుంచి ఇరవై రోజుల పాటు జరిగే ఆవిర్భావ వేడుకలను ఆమె స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బీఆరెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసే దిశగా ఆమె తనవంత కృషి మొదలు పెట్టారు. ఆమె లేక మొన్నటి వరకు ఇందూరు రాజకీయాలు అనాథలా మారాయి. సమన్వయం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చదంగా ఉండేది.

ఇప్పుడు రంగంలోకి రాగానే, ప్రజలతో మమేకం కాగానే కొత్త ఊపు వచ్చింది. దీంతో ఆమె క్యాంపు కార్యాయానికి క్యూ కట్టారు జనాలు. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు తెస్తున్నాయి. అందరినీ కలుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా వెళ్లి కలసి వస్తున్నారు. పరామర్శలు చేస్తున్నారు. ఫంక్షన్లకు అటెండ్‌ అవుతున్నారు. ఆపదలో ఉన్న వారికి వెంటనే స్పందించి సత్వర పరిష్కారం, సేవలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయంఉన్నా.. ఆమె మాత్రం ఇప్పటి నుంచే పరిస్థితిని గాడిలో పెట్టే పనిని కర్తవ్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.

ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటున్నారు. లోపాలు, తప్పొప్పులను సరిచేస్తూ… ఎన్నికల సమాయానికి ప్రజల వద్ద ఏ మాత్రం వ్యతిరేకత లేకుండా పార్టీని ఓన్‌ చేసుకునేలా మమేకం కావాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద, క్యాంపు కార్యాలయం వద్ద జన జాతర మొదలయ్యింది. అందరినీ కలుస్తున్నారు. పబ్లిక్‌తో ఆ ప్రాంతమంతా కలకలలాడుతున్నది. ఇక నుంచి తన దూకుడు మరింత పెంచేలా ఆమె మాటలు, చేస్తున్న కార్యక్రమాల ద్వారా తెలియవస్తోంది. ఇది ప్రతిపక్షంలో వణుకుపుట్టిస్తోంది. కవితే నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ఆట మొదలైంది. ఇక అసలు సినిమా ముందుందంటున్నారు ఇందూరు బీఆరెస్‌ శ్రేణులు.

 

You missed