ఎంపీగా కవిత ఓడిపోవడంతో ఎంతో నష్టం జరిగిందని బీఆరెస్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం ధర్పల్లి మండల బీఆరపార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకున్నారు. ఎంపీగా అర్విందును గెలిపించుకుని మోసపోయామన్నారు. మాయమాటలు చెప్పి, పసుపు రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్‌ వల్ల ఒరిగిందేమీ లేదని వాపోయారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు మురళీధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కవితక్కను ఓడగొట్టుకున్న తర్వాత దరిద్రం పట్టుకుందన్నారు. ఆమె గెలిచి ఉంటే మరింత అభివృద్ది జరిగేదన్నారు.

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ రూరల్ నియోజకవర్గంలో చేసిన అబివృద్దిలో పార్లమెంటు మొత్తంగా పది పైసల అభివృద్ది అర్వింద్‌ చేయలేదన్నారు. సోషల్‌ ఇన్చార్జి రవికాంత్‌ మాట్లాడుతూ అర్వింద్‌ పసుపు రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచాడంటూ దుయ్యబట్టారు. అర్వింద్‌ గెలిచి ఇక్కడ ప్రజలకు చేసిందేమీ లేదు కానీ కొత్తగా శ్రీరామ్ అని ఉపదేశం నేర్పిస్తున్నాడని, అంటే అర్వింద్‌ రాకముందు వరకు ప్రజలకు శ్రీరాముడు తెలియదా..? జై శ్రీరామ్‌ నినాదం తెల్వదా..? నిన్ను గెలిపించింది ఈ మాటలు చెప్పేందుకేనీ..? అని ధ్వమజెత్తారు. ఇలాంటి వేషాలకు ప్రజలు మోసపోరని, కర్ణాటకలో కర్రుకాల్చి వాత పెట్టారంటూ సెటైర్లు వేశారు.

You missed