బాజిరెడ్డి జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపింనచుకోవాలని, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే తనయుడు జగన్‌ను ఎమ్మెల్యేగా చూడాలరని ఆకాంక్షించారు బీఆరెస్‌ పార్టీ రూరల్ నియోజకవర్గ నాయకులు. సోమవారం జరిగిన ధర్పల్లి మండల బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు జగన్‌ జపం చేశారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం బాజిరెడ్డి వారసుడిగా జగన్‌ను బరిలోకి దింపే అవకాశం ఉందని, దీనిపై ఇప్పటికే బాజిరెడ్డి బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఉన్నారని, ఆయన కూడా సూత్రప్రాయంగా దీనికి ఓకే చెప్పారనే వార్తను వాస్తవం ప్రచురించింది. ఇది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఈ విషయంపై చాలా మంది నాయకులు తమ ప్రసంగంలో ప్రస్తావించారు. జగన్‌ ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. అధిష్టానం ఆదేశానుసారం జగన్‌ అభ్యర్థిత్వానికి గ్రీన్‌ సిగ్నల్ దొరకగానే గోవర్దన్‌ నాయకత్వంలో జగన్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ధర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌ ఈ సమ్మేళనంలో తీర్మానం కూడా ప్రవేశపెట్టాడు. సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులంతా తమ కరతాళ ధ్వనులతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

You missed