కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటేనే ఆస‌క్తి. ఏం మాట్లాడ‌తాడా..? ఎవ‌రిని తిడ‌తాడా..? కొత్త విష‌యాలు ఏం చెబుతాడా.? అని అంద‌రికీ ఆస‌క్తి. ఆమాట‌కొస్తే అన్ని పార్టీల‌కు కూడా. బ‌హుశా ఏ సీఎం కూడా ఇలా గంట‌ల కొద్దీ ప్రెస్‌మీట్ పెట్టి ఉండ‌డ‌నుకుంటా. కేసీఆర్ ప్రెస్‌మీట్ గొప్ప‌త‌నం ఏందంటే .. గంట‌ల కొద్దీ మాట్లాడినా ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. అదే టెంపో.. అదే స్పీడ్.. అదే జోష్‌.. అలా సాగిపోతుంద‌న్న‌మాట‌. ఇప్పుడు ఆ ప్రెస్‌మీట్ కోసం ముఖం వాచిపోయేలా చూస్తున్నారు జ‌నం అంతా. ఒక్క తెలంగాణే కాదు … తెలుగు రాష్ట్రాలు.. ఆ మాట‌కొస్తే యావ‌త్ దేశం. అవును. ఇక్క‌డ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ‌కు తెర‌దించాలంటే కేసీఆర్ మాట్లాడాల్సిందే. ప్రెస్‌మీట్ పెట్టాల్సిందే. అస‌లు జ‌రిగింది ఆయ‌న నోటి వెంట వింటేనే త‌ప్ప ఈ క‌థ‌లో మిస్ట‌రీ వీడేలా లేదు.

స‌మ‌యం గ‌డుస్తున్న‌కొద్దీ న‌రాలు తెగే ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఓ వైపు సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి తోచించి వారు పెడుతున్నారు. ఎవ‌రి తీర్పులు వారిచ్చేసుకుంటున్నారు. టీఆరెస్ శ్రేణుల‌ను మాత్రం మాట్లాడొద్ద‌ని కేటీఆర్ బ్రేక్ వేయ‌డంతో సైలెంట్ అయిపోయారు. కానీ వారు మ‌న‌సు ఆగ‌డం లేదు. సార్ ఓ ప్రెస్‌మీట్ పెట్టొచ్చు క‌దా..! ఎప్పుడు పెడ‌తార‌ట‌. అస‌లు ఏం జ‌రుగుతోంది..? కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారా..? అక్క‌డే ప్రెస్‌మీట్ పెట్టి ఏకి పారేస్తాడా..? బీజేపీ వాళ్లు బెదిరిస్తున్నారా..? మ‌రెందుకు ఈ విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. ఇదే మంచి మోఖా… దొరికిండ్రు దొంగ‌లు… బీజేపీని లేవ‌కుండా చావ‌గొట్టొచ్చు. బండ‌కేసి ఉతుకొచ్చు…. ఇలా ఉంది గులాబీ దండు ఆవేశం. ఆక్రోషం.. అనుమానాలు. కానీ అక్క‌డ కేసీఆర్ మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు.

ఆచితూచి అడుగులేస్తున్నాడు ఈ విష‌యంలో. ఢిల్లీకి వెళ్తున్నాడు అనే అంశ‌మే మ‌ళ్లీ ఉత్కంఠ‌ను పెంచి.. న‌రాలు తెగేలా చేస్తుంది అంద‌రికీ. అక్క‌డ మీడియాతో మ‌ట్లాడ‌తాడా…? దీన్ని స్టేట్ ఇష్యూ కాకుండా దేశ వ్యాప్తంగా ర‌చ్చ చేసి బీజేపీ ప‌రువును బ‌జారుకీడ్చాల‌ని ప్లానింగ్ వేశాడా..? అయితే రాజ‌కీయం మ‌రింత రంజుగా కానుంది… ఇగో ఇప్పుడు మ‌ళ్లీ ఇదో చ‌ర్చ‌. కేసీఆర్ నోరు విప్పితే గానీ … ఈ ఉత్కంఠ‌కు తెర‌ప‌డేలా లేదు. దీన్ని మాములు విష‌యంగా కేసీఆర్ తీసుకోవ‌డం లేద‌నేది వాస్త‌వం. కానీ స‌మ‌యం కోసం వేచిచూడ‌టం వెనుక ఆయ‌న ప్లానింగ్ ఏందో ఎవ‌రికి అంతు చిక్క‌డం లేదు. అందుకే ఇలా సోష‌ల్ మీడియాలో ప్లీజ్ ప్లీజ్ ఒక్క ప్రెస్‌మీట్ సార్‌.. అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

You missed