ఇంద్ర‌వెల్లి వేదిక‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట‌లు దుమారం రేపాయి. అధికార పార్టీ నేత‌లు ఈ మాట‌ల పై స్పందించారు. హుందాగ‌ మాట్లాడాల‌ని, ఇష్ట‌మొచ్చిన‌ట్లు నాలుక కోస్తామంటూ గ‌ట్టిగానే కౌంట‌రిచ్చారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను జైలుకు పంపుతాను అని త‌న స్పీచ్‌లో అన్న మాట అధికార పార్టీని షేక్ చేసింది. త‌ను ఏదైతే ఊహించి బాణం వేశాడో స‌రిగ్గా త‌గ‌లాల్సిన చోట త‌గిలింది. దీంతో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్ పై విరుచుకుప‌డ్డారు.

రేవంత్‌రెడ్డే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌శాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. ఓటుకు నోటు కేసుతో పాటు ఇంకా కేసులు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చాయ‌ని, మొన్న‌టి వ‌ర‌కు కొద్ది రోజులు మాత్ర‌మే చ‌ర్ల‌ప‌ల్లి జైలులో గ‌డిపిన రేవంత్‌.. ఇక శాశ్వ‌తంగా చ‌ర్ల‌ప‌ల్లిలోనే గ‌డ‌పాల్సి వ‌స్త‌ద‌ని హెచ్చ‌రించాడు. పీసీసీ చీఫ్ జైలుపాల‌య్యే అరుదైన అవ‌కాశం రేవంత్‌కు ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశాడు. ద‌మ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని స‌వాలు విసిరాడు. అలా గెలిపించుకోవ‌డం మీత‌రం కాద‌ని, నీ పీసీసీ ప‌ద‌వి ఊడుతుంద‌ని మీ నేత‌లే చెప్పుకుంటున్నార‌ని అన్నాడు.

ఇంద్ర‌వెల్లి కాంగ్రెస్ స‌భ‌లో రేవంత్ మాట్లాడిన వ్యూహాత్మ‌క తీరుకు అధికార పార్టీ చిక్కుకుంది. వెంట‌నే స్పందించింది. ఘాటుగా తిప్పికొట్టినా.. రేవంత్‌కు ఆ పార్టీకి మ‌రింత జీవం పోసేలా అధికార పార్టీ చ‌ర్య ఉంద‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. మొన్న‌టి వ‌ర‌కు బండి సంజ‌య్ ఇష్టారీతిన కేసీఆర్‌ను తిట్టినా ఎవ‌రు స్పందించ‌లేదు.. ప‌ట్టించుకోలేదు. అర్వింద్ సీఎంను తిట్టి తిట్టి కామ‌న్ అయిపోయింది. అయినా ఎవ‌రూ కౌంట‌ర్ ఇవ్వ‌రు. కానీ రేవంత్ తొలిస‌భ‌కే ఈ రీతిలో అధికార పార్టీ నుంచి రియాక్ష‌న్ రావ‌డం రేవంత్ వ్యూహంలో ఆ పార్టీ చిక్కుకుంద‌నే చెప్పాలి.

కాగా రేవంత్ వ్య‌క్తిత్వాన్ని త‌గ్గించి, చ‌రిత్ర హీనుడు అని చెప్పేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. చంద్ర‌బాబు బినామీ అని, ఆంధ్రుల చిలుక‌ప‌లుకు మాట్లాడే నేత అని, పొలిటిక‌ల్ బ్రోక‌ర్ అని , చీక‌టి ఒప్పందాలు చేసుకునే చిల్ల‌ర‌గాడంటూ, బుడ్డ‌ర్‌ఖాన్ అని తిడుతూ టీఆరెఎస్ కూడా రెండు, మూడు మెట్లు కింద‌కి దిగింది. రేవంత్‌ను హుందాగ మాట్లాడాల‌ని హెచ్చ‌రిస్తూనే తామేమీ త‌క్కువ కాదంటు అధికార పార్టీ నేత‌లు విరుచుకు ప‌డుతున్నారు.

మొత్తానికి రేవంత్ ఇంద్ర‌వెల్లి స‌భ ఆరంభ‌మే జైలు రాజ‌కీయాల అంశంతో మొద‌లైంది. ఇదే జైలు అంశం అటు అధికార పార్టీ త‌మ అస్త్రంగా వాడుకోని, రేవంత్‌ను ఇర‌కాటంలో పెట్టి ఆత్మ సంర‌క్ష‌ణ‌లో ప‌డేయాల‌ని భావిస్తుంది. మున్ముందు ఈ ఇరు పార్టీల ఎత్తుకు పైఎత్తులు, మాట‌ల దాడులు ఎంత వ‌ర‌కు పోతాయో చూడాలి.

You missed