హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆరెఎస్ సోష‌ల్ మీడియాను విస్తృతంగా వాడుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. దుబ్బాక‌లో జ‌రిగిన లోపాల‌ను, లోటుపాట్ల‌ను స‌మీక్షించుకుంటున్న‌ది. హ‌రీశ్‌రావు హుజురాబాద్ ఇంచార్జీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డంతో సిద్దిపేట్ నుంచే మంత్రాంగాన్ని న‌డిపిస్తున్నాడు. నేత‌ల‌ను అక్క‌డికి పిలిపించుకుని దిశానిర్ధేశం చేస్తున్నాడు. దుబ్బాక‌లో దెబ్బ‌కొట్టిన సోష‌ల్ మీడియాను ఈ సారి ఆషామాషీగా తీసుకోవ‌డం లేదు. అందుకే మంత్రి హ‌రీశ్‌రావు నిన్న సిద్దిపేట్‌లో సోష‌ల్ మీడియా యాక్టివ్ మెంబ‌ర్స్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేశాడు.

హుజురాబాద్ ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలో, ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల పోస్టుల‌ను ఎలా కౌంట‌ర్ చేయాలో ఇందులో లోతుగా డిస్క‌ష‌న్స్ చేశాడు. గ‌తంలో టీఆరెఎస్ సోష‌ల్ మీడియా అంత యాక్టివ్‌గా లేదు. బీజేపీ సోష‌ల్ మీడియా ఫేక్ ప్ర‌చారాల‌తో తాను అనుకున్న‌ది సాధించ‌గ‌లిగింది. దుబ్బాక‌లో ఆ దెబ్బ టీఆరెఎస్‌కు బాగానే ప‌డింది. దీంతో భారీ అంచ‌నాలు పెట్టుకున్న దుబ్బాక ఫ‌లితం టీఆరెఎస్‌కు చేదు అనుభ‌వం మిగిల్చింది. ఆ దెబ్బ‌తో తేరుకున్న హ‌రీశ్‌.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇంచార్జీ ఇవ్వ‌డంతో ప్ర‌ధానంగా దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. సొంత మీడియా ఉన్నా.. చివ‌ర‌కు సోష‌ల్ మీడియానే దిక్కైంది. అయితే ఇక్క‌డే కొత్త చిచ్చు ర‌గిలింది. సోష‌ల్ మీడియా మీటింగ్‌లో పాల్గొన్న వారియ‌ర్స్ హ‌రీశ్‌రావుతో ఫోటోలు దిగి ఏఫ్‌బీలో పోస్ట్ చేశారు. ఇది కొత్త ర‌గ‌డ‌కు తెరతీసింది.

ఈ మీటింగ్‌కు అంద‌రికీ ఆహ్వానం లేద‌నే అసంతృప్తికి దారి తీసింది. చాలా మంది యాక్టివ్ మెంబ‌ర్స్ టీఆరెఎస్ నాయ‌కుల‌తో ప్ర‌త్యేక్ష సంబంధాలు లేక‌పోయినా కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ప్రేమ‌తో ఎప్ప‌టిక‌ప్పుడు టీఆరెఎస్ అనుకూల పోస్టుల‌ను పెడుతూ వ‌స్తున్నారు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల దాడుల‌ను త‌మ‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కూడా హ‌రీశ్‌రావు నుంచి ఆహ్వానం అంద‌క‌పోవ‌డం వారిని తీవ్ర అసంతృప్తికి లోనుచేసింది. దీంతో ఫేస్‌బుక్‌లో త‌మ
వాల్స్ పై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. ఇంత ప‌నిచేస్తున్నా క‌నీస గుర్తింపు లేద‌నే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
ఇది హ‌రీశ్‌రావుకు కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెట్టింది.

One thought on “టీఆరెఎస్ సోష‌ల్ మీడియాలో సిద్దిపేట చిచ్చు…”
  1. హుజురాబాద్ ఉప ఎన్నికలకు నమస్తే తెలంగాణ రిపోర్టర్ విస్తృతంగా వాడుకుంటున్నారు అక్కడ టిఆర్ఎస్ గెలిపిస్తే కూడా ఇస్తామని స్థానిక నమస్తే తెలంగాణ రిపోర్టర్ లకు వాగ్దానాలు కూడా ఎడిటర్ కృష్ణమూర్తి చేశారు ఆగస్టు పదో తారీకు జరిగిన సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడిస్తూ అక్కడ పనిచేస్తున్న నమస్తే తెలంగాణ విలేఖర్లకు నెలకు 25000 ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రేపటి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మరిన్ని తాయిలాలు కూడా ఇస్తామని ప్రకటించారు నమస్తే తెలంగాణ విలేకరి కృష్ణమూర్తి టిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు గా మారుతున్నారు

Comments are closed.

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….