Tag: #cmrevanthreddy. #

ప‌దెక‌రాలకు క‌టాఫ్ పెడితే బాగుండె…! వ్య‌వ‌సాయ‌యోగ్యం అంటూ మ‌ళ్లీ ఫైర‌వీల‌కు బాట‌లు.. లంచాలకు దారులు..! సాగు నిర్దార‌ణ అధికారుల‌పై ఇక నేత‌ల ఒత్తిళ్లు.. రాష్ట్రంలో 90 శాతం వ‌ర‌కు ప‌దెక‌రాల లోపున్న‌వారే..! అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్ త‌ప్పుడునిర్ణ‌యాల ప‌థ‌కం… రైతుభ‌రోసా కూడా రైతుబంధులా స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే ప‌థ‌క‌మేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొండంత రాగం తీసి.. చివ‌ర‌కు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాట‌లోనే సాగాడు. అప్పుడు కేసీఆర్ రైతుబంధును ప‌క్కా ఓటుబ్యాంకు ప‌థ‌కంగా మార్చాడు. వంద‌ల ఎక‌రాల బ‌డా భూస్వాముల‌కూ ఇచ్చాడు. ఎందుక‌ని అడిగితే.. ఏదో రెండువేల ఎక‌రాలే ఎక్క‌వ‌వుతున్నాయి..…

మీడియా మీద సీఎం సారు చికాకు..! రైతు భ‌రోసాపై ఎవ‌రికి వారే క‌థ‌నాలు వండి వార్చార‌ని చుర‌క‌లు..!! మంత్రివ‌ర్గ మీటింగు మూడు గంట‌లు…. కీల‌క‌మైన మూడు నిర్ణ‌యాలు.. ప్రెస్‌మీట్ టూకీగా ముగింపు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ మీటింగు త‌రువాత పెట్టే ప్రెస్‌మీట్ సుధీర్ఘంగా ఉంటుంది. కీల‌క‌మైన నిర్ణ‌యాలపై సుధీర్ఘ‌మైన వివ‌ర‌ణ‌లుంటాయి. అదీ సీఎం ప్రెస్‌మీట్ క‌దా. అంతా ఏదో ఊహించారు. కానీ సీఎం మాత్రం ఊహాజ‌నిత క‌థ‌నాల‌కు ఇక బ్రేక్ వేయండ‌నే చుర‌క‌తో మీడియా…

డ‌బుల్ ధ‌మాకా..! చ‌బ్బీస్ జ‌న‌వ‌రి విడుద‌ల‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ కొత్త ఏడాదిలో కొత్త ప‌థ‌కాల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతున్న‌ది. చ‌బ్బీస్ జ‌న‌వ‌రి నుంచి డబుల్ ధ‌మాకాగా రైతుల‌కు, పేద‌ల‌కు ప‌థ‌కాలు వ‌ర్తించ‌నున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరైతు భ‌రోసా పథ‌కంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రాళ్లు ర‌ప్ప‌లు,…

మ‌ళ్లీ మీకే.. కానీ…! మీ ఏడాది ప్రోగ్రెస్ నా చేతిలో…! మ‌నం మారాలె…! మార్పు తేవాలె..!! జ‌నంతో క‌లిసి ఉండాలె..! ఇక‌పై కొత్త పాల‌న షురూ.. ఎమ్మెల్యేల‌కు సీఎం న్యూ ఇయ‌ర్ హితబోధ‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ చేసిన‌ట్టే చేస్తున్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. సిట్టింగుల‌కే మ‌ళ్లీ టికెట్లు ఇస్తానంటున్నాడు. ప‌రోక్షంగా అదే విష‌యాన్ని వెల్ల‌డించాడు వారితో. కానీ .. అని మెలిక పెట్టాడు. కండిష‌న్ అప్లై అన్నాడు. అక్క‌డ జ‌రిగిన పొర‌పాట్లేందో తెలుసు. కేసీఆర్ చేసిన…

ద‌టీజ్ కింగ్ నాగార్జున్‌…! హైడ్రా పేరుతో మొద‌ట రేవంత్ బ‌లిప‌శువును చేసింది నాగ్‌నే…!! మంత్రి కొండా సురేఖ వ‌ల్గ‌ర్ మాట‌ల‌తో అక్కినేని ప‌ర‌ప‌తిని బ‌య‌ట‌కు గుంజిన కాంగ్రెస్‌..! అయినా ఆమె పై చ‌ర్య‌ల్లేవు…! నాగ్ న్యాయ పోరాటం చేసినా… ఇండ‌స్ట్రీ కోసం అన్నీ మ‌రిచీ…! అదీ కింగ్ హుందాత‌నం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌చ్చీ రాగానే టాలీవుడ్‌పై ప‌డ్డాడు రేవంత్‌రెడ్డి. మొద‌ట‌గా బ‌లిపెట్టింది నాగార్జున‌ను. వివాద‌ర‌హితుడిగా త‌న ప‌ని తాను చేసుకుపోయే త‌త్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాట‌లో సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన‌వాడు. బ‌తుకుతున్న‌వాడు. రాష్ట్రంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా…

తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌..!! టాలీవుడ్‌ను నేల‌కు దించి.. త‌న‌దారికి తెచ్చుకున్న రేవంత్‌..!! నేడు సీఎంతో సినీ పెద్ద‌ల భేటీ..! చిరంజీవి, వెంక‌టేశ్‌, అల్లు అర్వింద్‌, దిల్‌రాజు.. సినీ ప్ర‌ముఖులు..! అంత‌రం తొల‌గించుకుని అహంభావం త‌గ్గించుకుని…! మ‌రి రేవంత్ ఎలా స్పందిస్తాడు…! త‌గ్గుతాడా..! త‌గ్గేదేలే.. అంటాడా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నెత్తికెక్కిన క‌ళ్ల‌ను నేల‌కు దించాడు. మాకు తిరిగేలేద‌నుకున్న ప్ర‌ముఖుల‌కు ముఖం వేలాడేసుకునేలా చేశాడు. సీఎం ఎవ‌రైతే మాకేంటీ…? అనే అహంభావానికి త‌న‌దైన బాణాన్ని వ‌దిలి దాన్ని తుత్తునియ‌లు చేశాడు. మొత్తానికి ఆ తారాలోకాన్ని ఇప్పుడు నేల‌కు దించాడు. వారంతా…

యాక్ష‌న్‌… రియాక్ష‌న్‌… ఓవ‌రాక్ష‌న్‌…!! పుష్ప సీన్ రివ‌ర్స్‌..! సినిమా సీఎం… రియ‌ల్ సీఎం…!! సీఎం రేవంత్ బెట్టు… సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు..! పుష్ప‌-2లో పైచేయి సాధించిన సీఎం..! డిఫెన్స్‌లో పోలీసులు…!

యాక్ష‌న్‌… రియాక్ష‌న్‌… ఓవ‌రాక్ష‌న్‌…!! పుష్ప సీన్ రివ‌ర్స్‌..! సినిమా సీఎం… రియ‌ల్ సీఎం…!! సీఎం రేవంత్ బెట్టు… సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు..! పుష్ప‌-2లో పైచేయి సాధించిన సీఎం..! డిఫెన్స్‌లో పోలీసులు…! ( మ్యాడం మ‌ధుసూద‌న్‌, సీనియ‌ర్ పాత్రికేయులు..) (9949774458) పుష్ప వివాదం…కార్చిచ్చులా…

వ్య‌వ‌సోయి లేని మంత్రి…! తుమ్మ‌ల ఏది మాట్లాడిన తుమ్మ‌బంకే..! స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేయ‌డ‌మే ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ర‌మార్ధం.. మ‌రింత గంద‌ర‌గోళ ప‌ర్చ‌డ‌మే ఈ మంత్రి మాటల ప‌రామ‌ర్ధం.. రైతుభ‌రోసాపై మ‌ళ్లీ అదే అవివేకం.. అయోమ‌యం..! ప్ర‌తిప‌క్షాలు ఇంకా ఏం చెప్ప‌లేద‌న్న వ్య‌వ‌సాయశాఖ మంత్రి..! అందుకే క్లారిటీకి రాలేక‌పోయామంటూ అసెంబ్లీలో కామెంట్స్‌… సంక్రాంతి త‌రువాతైనా ఇస్తారా… ఇంకా సాగ‌దీస్తారా..? మ‌ళ్లీ రైతుల్లో అనుమానాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోయిత‌ప్పి మాట్లాడుతుంటాడు. ఆ ఇష్యూ ఎంత‌టి సెన్సిటీవో తెలుసు. కానీ ఆయ‌న మాట‌ల క‌రుకుద‌నం, కాఠిన్యం.. అవ‌గాహ‌న‌లేమి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వంటూ కొత్త స‌మ‌స్య‌లు తెచ్చిపెడ‌తాయి. పేరుకు పెద్ద సీనియ‌ర్.. కానీ అనుచ‌ర‌ణ‌లో అనుభ‌వం అణుమాత్రం కూడా క‌నిపించదు.…

కిష్కింధ‌కాండ‌…! అది అసెంబ్లీనా…! పుష్ప‌-2 సినిమా ధియేట‌రా..!! బీఆరెస్ స‌భ్యుల చ‌ర్య‌లు విస్మ‌యం.. హ‌రీశ్ తీరు, వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు.. పేప‌ర్ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రి దాడుల‌తో అభాసుపాలు..!! కాంగ్రెస్ స‌భ్యుడు చెప్పు చూప‌డం వివాద‌స్ప‌దం.. !

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీని మ‌రీ ర‌చ్చ రంబోలా చేసేశార‌బ్బా. అధికారం కోసం, ఈగో, ఫ్ర‌స్ట్రేష‌న్ కోసం అసెంబ్లీని పుష్ప -2 థియేట‌ర్ చేసేశారు. తోపులాట‌లు, పేప‌ర్లు విసురుకోవ‌డాలు, టికెట్ల కోసం తోపులాట‌ల మాద‌రిగా స్పీక‌ర్ చాంబ‌ర్ వ‌ద్ద‌కు తోసుకుపోవ‌డం.. యూజ్‌లెస్ ఫెలోస్…