(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ చేసినట్టే చేస్తున్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తానంటున్నాడు. పరోక్షంగా అదే విషయాన్ని వెల్లడించాడు వారితో. కానీ .. అని మెలిక పెట్టాడు. కండిషన్ అప్లై అన్నాడు. అక్కడ జరిగిన పొరపాట్లేందో తెలుసు. కేసీఆర్ చేసిన తప్పిదమేంటో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే రిపీట్ చేయాలనుకోవడం లేదు. కానీ వారికే టికెట్లిస్తానంటున్నాడు. ఇలా అయితే కాదంటూ మెలిక పెట్టాడు. ఏడాది పాలనలో వారిపై వచ్చినవి పాజిటివ్ రిపోర్టులేమీ కాదు. అది సీఎం కు తెలుసు. అందుకే మీ ప్రోగ్రెస్ రిపోర్టు నా దగ్గర ఉందన్నాడు. కేసీఆర్ కూడా ఇలాగే అన్నాడు. మారాలన్నాడు. కానీ వారెరవూ మారలేదు. కేసీఆర్ కూడా మారలేదు.
వారికే మళ్లీ మళ్లీ టికెట్లిచ్చాడు. గత్యంతరం లేక. అందరూ కలిసి కేసీఆర్ పుట్టి ముంచారు.ఇప్పుడు రేవంత్ అదే బాటలో పోతున్నాడు. హితబోధ చాలు చేశాడు. కానీ వినేవారంతెమంది. ఆకలితో ఉన్నారు. ఎక్కడికక్కడ దోచుకుతింటున్నారని ఇప్పటికే విపరీతంగా ప్రచారం ఉంది చాలా చోట్ల. అందుకే ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నాడా..? వారిని కంట్రోల్ చేస్తాడా..? వారి ఉచ్చులోనే ఇరుక్కుంటాడా..? గతి తప్పి గత్యంతరం లేక మళ్లీ వారికే టికెట్లు ఇచ్చేస్తాడా..? మారుస్తాడా..? మారుతారా..? ఏమో.