(దండుగుల శ్రీనివాస్)
నెత్తికెక్కిన కళ్లను నేలకు దించాడు. మాకు తిరిగేలేదనుకున్న ప్రముఖులకు ముఖం వేలాడేసుకునేలా చేశాడు. సీఎం ఎవరైతే మాకేంటీ…? అనే అహంభావానికి తనదైన బాణాన్ని వదిలి దాన్ని తుత్తునియలు చేశాడు. మొత్తానికి ఆ తారాలోకాన్ని ఇప్పుడు నేలకు దించాడు. వారంతా సీఎం రేవంత్‌తో కలిసేందుకు దారి పట్టారు. ఈ సమయం కోసం ఎదురు చూశాడు రేవంత్. అల్లు అర్వింద్.. పుష్ప-2 వివాదం చినికి చినికి గాలి వానలా మారింద.
నాగర్జున్ ఎన్ – కన్వెన్షన్ కూల్చివేతతో టాలీవుడ్‌తో అంతరం పెంచుకున్న రేవంత్.. పుష్ప ను జైలుకు పంపి తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. తనెంటే ఏంటో నిరూపించుకున్నాడు. ఇక కేసీఆర్ జపం మాని.. రేవంత్‌గా నేను ఇక్కడ సీఎంగా ఉన్నాననే భయం, భక్తి ప్రదర్శించాలనే హుకుం జారీ చేశాడు. తన చేతల ద్వారా. హుకూం… టైగర్ కా హుకూం..! అనే డైలాగులానే ప్రవర్తించాడు సీఎం రేవంత్ సినీ నటుల విషయంలో. వారు వీరు అని ఎవరినీ చూడలే.
మరెవర్నీ వదల్లే. అందుకే ఇప్పుడు సినీ పెద్ద తలలు పోలో మంటూ బయలుదేరారు రేవంత్ దగ్గరకు. పెరిగిన అంతరాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు. కానీ నాగార్జున ఈ టీమ్‌లో లేడు. ఇప్పుడు బాధంతా చిరంజీవీ.. ఆ కుటుంబానికే కదా. అందుకు దిల్‌రాజు మధ్యవర్తిత్వం వహించాడు. మరి సీఎం రేవంత్ మెత్తబడతాడా..? తగ్గుతాడా…? తగ్గేదేలే…. అని అదే పంతం మీద ఉంటాడా..? అనే విషయమే ఇప్పుడు ఆసక్తిగా మారింది.